టీడీపీ పాలనలో మాకు ఉపకారం జరగలేదు

చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్పారు

వైయస్‌ షర్మిలకు మత్స్యకారుల మొర

పశ్చిమగోదావరి: పెదవేగి మండలం నడిపల్లిలో మత్స్యకారుల సమస్యలను  వైయస్‌ షర్మిల అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పాలనలో మాకు ఉపకారం జరగలేదని అన్యాయమే జరిగిందని వైస్‌ షర్మిలకు మత్స్యకార మహిళలు  మొరపెట్టుకున్నారు. చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్పారన్నారు. చంద్రబాబు.. డ్వాక్రా రుణమాఫీ అన్నారని,  2 రూపాయల వడ్డీ కట్టించుకున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో మత్స్యకారులకు ఎంతో మేలు జరిగిందన్నారు.ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు పెరిగిపోతాయని తెలిపారు. మత్స్యకారులతో  వైయస్‌ షర్మిల మాట్లాడుతూ ఒక మహిళా అధికారి వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చిన చింతమనేనికి ఈసారి గట్టిగా బుద్ధిచెప్పాలన్నారు.

చింతమనేని ప్రభాకర్‌పై 38  కేసులు ఉన్నాయని,మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బయటకు తీద్దామన్నారు.చింతమనేని వంటి ఒక  రౌడీకి చంద్రబాబు సీటు ఇచ్చారని విమర్శించారు. రాజన్న రాజ్యంలో ప్రజలదే రాజ్యం మన్నారు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే అందరికి మంచి జరుగుతుందన్నారు. ఎన్ని లక్షలు అయినా ప్రభుత్వమే భరించి  మీ పిల్లలను చదివిస్తుందన్నారు.చదువుకోడానికి మెస్,హాస్టల్‌ చార్జీలు కూడా ఇస్తారన్నారు. అక్కాచెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేసి నాలుగు దఫాల్లో మీ చేతుల్లో పెడతామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద మే నెలలో 12,500  రూపాయలు ఇస్తారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ  నిధి  ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు వేలతో కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని  ఏర్పాటు చేస్తామన్నారు.  25 ఎంపీలు గెలిపించుకోవడం ద్వారా ప్రత్యేకహోదా సాధించుకోవచ్చన్నారు. దీనివల్ల ఉద్యోగాలు రావడంతో పాటు రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

 

Back to Top