

















పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి సీదిరి అప్పలరాజు
పలాస : తెలుగు దేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. పలాస నియోజకవర్గంలోని మందస మండలం, బేతాలపురం ఎంపీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి సీదిరి అప్పలరాజు కండువా కప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మందస మండలం, భేతలపురం ఎంపీటీసీ సూరడా వాసు, తిమ్మల గణపతి, కిలు పాపారావు, బైపల్లి జోగోరావు, గొరకల రాజు, వారి అనుచరులు సుమారు వంద కుటుంబాలు ఉన్నాయి. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నియోజకవర్గం పరిశీలకులు కే.వి.సూర్యనారాయణ రాజు(పులిరాజు) తదితరులు పాల్గొన్నారు.