ప‌ల్నాడులో ప‌చ్చ నేత‌ల ఆరాచ‌కం

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌పై క‌త్తులు, ఇనుప‌రాడ్డుల‌తో దాడి 

పల్నాడు: జిల్లాలో టీడీపీ నేత‌ల ఆరాచ‌కం, దాడులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గుండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత నర్రెడ్డి లక్ష్మా రెడ్డిపై కత్తులు, ఇనుపరాడ్డులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మా రెడ్డిని అంతమొందించాలనే పథకంతో టీడీపీ నాయకులు ఊరి చివర మాటు వేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Back to Top