పేద విద్యార్థి కలను సాకారం చేసేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ చేయూత‌

కోన‌సీమ : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని పాల‌కొల్లుకు చెందిన దంగేటి జాహ్న‌వి క‌లిశారు. తన ఉన్నత చదువు కోసం గతేడాది జూలైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా చేసిన సాయానికి గానూ సీఎం వైయ‌స్ జగన్‌ను త‌న కుటుంబ స‌భ్యుల‌తో స‌హా క‌లిసి జాహ్న‌వి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్న‌వి గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జాహ్నవి ఏవియేషన్‌ శిక్షణకు ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ రూ. 50 లక్షల సాయం అందజేశారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి.. అమెరికా ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. జాహ్న‌వి విజ్ఞ‌ప్తిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. 

భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్ప స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు జాహ్న‌వి ముఖ్య‌మంత్రికి వివ‌రించింది. గతంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అందించిన ఆర్థిక సాయంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన జాహ్నవి ఐఐఏఎస్‌ ఫ్లోరిడా, యూఎస్‌ఏ నుండి సైంటిస్ట్‌ వ్యోమగామి అభ్యర్థిగా సిల్వర్‌ వింగ్స్‌ అందుకున్నారని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివ‌రించారు.

తాజా వీడియోలు

Back to Top