వైయ‌స్ జగన్‌ను గద్దె దించలేమనే.. హత్యకు చంద్రబాబు కుట్ర

మీడియా స‌మావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు 

వైయ‌స్ జగన్‌ గారిపై దాడి చంద్రబాబు వర్గీయుల కుట్రే..

అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నదన్న కక్ష వారిది

వైయ‌స్ జగన్‌ గారిపై దాడితో రాష్ట్రం నివ్వెరపోయింది         

మీరెన్ని కుట్రలు చేసినా జగన్‌గారిని ప్రజలే కాపాడుకుంటారు

భవిష్యత్తులో చంద్రబాబు కుట్రలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అంబటి రాంబాబు

రాజకీయ పరిజ్ఞానంలేని తిక్కలోడు పవన్‌కళ్యాణ్‌

బాబుకు ఇంకెన్నాళ్లు దాస్యం చేస్తావ్ పవన్..?

పిఠాపురంలో గెలవలేవు.. సినిమాలకూ పనికిరావు

2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు అండ్‌ కో.. రాజకీయ సమాధి ఖాయం

మంత్రి అంబటి రాంబాబు 

సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిను గద్దె దించలేమనే.. హత్యకు చంద్రబాబు కుట్రప‌న్నార‌ని మంత్రి అంబటి రాంబాబు అనుమానం వ్య‌క్తం చేశారు.  సీఎం వైయ‌స్ జగన్‌ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్‌కు తెలుసు. అందుకే ఇలా దాడికి ప్లాన్‌ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోమవారం స‌త్తెన‌ప‌ల్లిలో మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  

మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటేః

వైయ‌స్ జగన్‌పై దాడితో రాష్ట్రం నివ్వెరపోయిందిః
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో రోడ్‌షో నిర్వహించే సందర్భంలో ఆయనపై గురిచూసి ఒక బలమైన రాయి వేశారు. క్యాట్‌బాల్‌తో వేశారో.. మరేదైనా పరికరం ఉపయోగించి ప్రయోగం చేశారో అర్ధం కాని పరిస్థితి. జగన్‌ గారి నుదిటిపైన బలమైన గాయం తగిలింది.
రాష్ట్రమంతా నివ్వెరబోయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ చర్య ఎందుకు జరిగింది..? అనే భావన అందరిలోనూ కలిగింది. అనేకమంది ప్రజాస్వామ్యవాదులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధపడ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు.. ఐదేళ్లపాటు కంటికి రెప్పలా చూసుకుంటున్న ప్రజలంతా చాలా ఆందోళనతో విలపించారు. తమ ఆవేదనను వెలిబుచ్చారు.

దాడి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందిః
ఉన్నన్నాళ్ళూ ఎంతో ఆరోగ్యంతో బ్రతికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన మా ప్రియతమ నాయకుడు డాక్టర్‌ శ్రీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని కోల్పోయాం. వారి తర్వాత అనివార్యమైన పరిస్థితుల్లో శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేసి, దిగ్విజయంగా జైత్రయాత్ర సాగించి,  రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకొచ్చారు. అలాంటి జగన్‌మోహన్‌రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన్ను ఏం చేయలేక ఏదో పెద్ద అఘాయిత్యం చేయాలనే కుట్ర జరుగుతుంది. ఇది నా రాజకీయ ఆరోపణ కాదు. పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే అందరికీ ఇదే అర్ధమౌతోంది. 

సింపతీ డ్రామాలాడాల్సిన అవసరం మాకేంటి..?
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ గారిపై దాడి జరిగి ఆయన నుదిటికి బలమైన గాయం తగిలితే.. ఇది ఎన్నికలకు ముందు డ్రామాలు అని చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లు అంటున్నారు. పోయినసారి ఎన్నికల ముందు కోడికత్తితో డ్రామా ఆడి సింపతీ కోసం చేశాని చెబుతున్నారు. ఇవాళ కూడా తనమీద తానే రాయి వేసుకున్నారని పవన్‌ కళ్యాణ్‌లాంటోళ్లు అంటున్నారు. ప్రజలంతా జగన్‌ గారిని ఎప్పట్నుంచో చూస్తూనే ఉన్నారు. ఆయన ఏనాడైనా సింపతీ కోసం రాజకీయం నడిపిన సందర్భం ఉందా..? అసలు, సింపతీ పొందాల్సిన పరిస్థితి వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఉందా..? ప్రజాబలమున్నటువంటి రాజకీయ పార్టీ మా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కెల్లా అత్యంత ప్రజాదరణ, ప్రజాబలం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అలాంటప్పుడు ఆయనకు సింపతీ అవసరమేంటి..? మాకున్న ఓట్లు మాకేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాల్లో గెలుస్తామనే ప్రగాఢమైన విశ్వాసం మాకుంది. అయితే, జగన్‌ గారి మీద ఎందుకంత కక్షబట్టారు..? ఎందుకని, ఏదో అఘాయిత్యం చేయాలనుకుంటున్నారు..? అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 

అమరావతిలో వారి రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బతిన్నదని కక్షః
అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని అన్నాడు చంద్రబాబు. దీంతో ఆయన వర్గీయులంతా రూ.లక్షల కోట్లు అక్కడ పెట్టుబడులు పెట్టారు. రూ.1 పెట్టుబడి పెడితే రూ.100 అయిపోతుందనుకున్నారు. రూ.లక్ష పెడితే రూ.1కోటి అయిపోతుందనుకున్నారు. రూ.వందల కోట్లు పెట్టుబడి పెట్టి రూ.లక్షల కోట్లు పెరుగుతున్నాయంటూ విర్రవీగారు. ఆ తర్వాత జగన్‌ మోహన్‌రెడ్డి గారు అధికారంలోకి రావడం.. తన పాలసీ మార్చుకుని మూడు రాజధానులు అని ప్రకటించడం జరిగింది. దీంతో వెంటనే.. అయ్యో, మన రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, వాటిపై ఆదాయం దెబ్బతినే పరిస్థితికి వచ్చిందని.. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఆర్థికంగా దెబ్బతినిపోతామని భావించి చంద్రబాబు వర్గీయులు మా నాయకుడిపై కక్ష కట్టి, కుట్రలు చేస్తున్నారు.

ఎటూ గద్దెదింపలేమని.. చంద్రబాబు చేసిన కుట్ర ఇదిః
రాష్ట్రంలో చంద్రబాబు వర్గీయులు చేస్తున్న కుట్రలో మొదటిది జగన్‌మోహన్‌రెడ్డి గారిని అధికారంలో నుంచి దించడం. అయితే, ఆ కుట్ర విఫలమైపోతున్నట్లుగా ఇప్పుడు అర్ధమౌతోంది. చంద్రబాబు ఒక్కడే పోటీచేస్తే అసలు పోటీయే ఉండదని.. అదే పవన్‌కళ్యాణ్‌ను కలుపుకుంటే కాపు సామాజికవర్గమంతా తనపార్టీకి మద్దతు పలుకుతారని.. ఇక, బీజేపీతో కూడా జత కడితే కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ గనుక స్థానిక అధికారులు మనమాట వింటారని.. ముగ్గురూ కలిసి కూటమి కడితే జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఓడించవచ్చనుకున్నారు. పాపం భ్రమ పడ్డారు. ఎట్టకేలకు ముగ్గురు జతకట్టి జెండాలు చేతపట్టినా సీట్ల దగ్గర తేడా వచ్చిందే.. ఒకరికొకరు కొట్టుకున్నారు తప్పితే.. వారి కలలు ఆవిరై పోయి, కూటమి పరిస్థితి అగమ్యగోచరమైంది. అదే, జగన్‌మోహన్‌ రెడ్డి గారు మాత్రం 175కి 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. నేరుగా ప్రజల్లోకి వెళ్లిపోతుంటే.. ఆయనకొచ్చే ప్రజాదరణను చూసి ఇక జగన్‌మోహన్‌రెడ్డి గారిని, వాళ్ళు ముగ్గురు కలిసినా.. ముప్పైమందితో కలిసివచ్చినా ఓడించడం సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చారు. అందుకే, మా నాయకుడు జగన్‌ గారిని హతమార్చడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడనేది వాస్తవం. 

చంద్రబాబు నాయుడుకు అధికారం లేకుంటే సహించలేడు. ఆయన అధికారం లేకుండా బతకలేడు. కనుకే, తాను కలలు గనే అధికారం దక్కడం లేదనే కక్షతో, ఈర్ష్యతో కుట్రలు, దారుణాలకు ఒడిగడుతున్నాడు. గడచిన ఐదేళ్లు ఆయన సహించలేకపోయాడు. సందర్భానుసారం తన పరిస్థితిని తలుచుకుని బావురుమని ఏడ్చాడు. శాసనసభకు రానన్నాడు. మళ్లీ వచ్చే ఐదేళ్లూ శాసనసభకు రాలేనని తెలిశాక ఈ రాష్ట్రంలో హింసకు తెగబడుతున్నాడు. తన వర్గీయులతో హింసను ప్రోత్సహిస్తూ కుట్రలు పన్నుతున్నాడు.

జగన్ గారిపై దాడి చేసి.. మీకు మీరే రాజకీయ సమాధి పేర్చుకున్నారుః
జగన్‌మోహన్‌రెడ్డి గారు అధికారంలో ఉంటే తమ వర్గీయులు ఆర్థికంగా ఎదగలేరు. అధికారంలో లేకుంటే బతకలేరు. మా అబ్బాయి లోకేశ్‌ రాజకీయ భవిష్యత్తు శూన్యమే అవుతుంది. పవన్‌కళ్యాణ్, బీజేపీని ఇంతమందిని కలుపుకుని వెళ్తున్నా.. ప్రజల్లో నాకు ఆదరణ లభించడం లేదు. కాబట్టి.. ఎలాగైనా జగన్‌మోహన్‌రెడ్డి గారిని హతమార్చాలనే కుట్రకు చంద్రబాబు వ్యూహ రచన చేసి ఉంటాడు. ఇది పచ్చి వాస్తవం.

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రజలందరి తరఫున నేనొక్కటే హెచ్చరిక చేస్తున్నాను. ఈసారి మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారిపై రాయి గానీ.. మరొకటేదైనా పడితే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు జగన్‌గారిపై ఎన్ని కుట్రలు చేస్తారో... అంతకంతకూ మీకు మీరే సమాధికట్టుకుంటారన్నది వాస్తవం. రేపు ఎన్నికల్లో ప్రజల చేతుల్లో మీకు ఘోరపరాభవం తప్పదు.

జగన్ గారిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారుః
చంద్రబాబు అండ్ కో..  మరీ, ఇంత నీచంగా దారుణాలకు ఒడిగడతారా..? మొన్నటిదాకేమో, జగన్‌మోహన్‌రెడ్డి గారు బయటకు రాలేదన్నారు. పరదాలు కట్టుకుని వెళ్తున్నారంటారా..? మరి, ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తరలివస్తున్న లక్షలాది ప్రజలు ఎలా వస్తున్నారు..? మొన్న సత్తెనపల్లిలో జరిగిన యాత్రలో రాష్ట్ర మంత్రిగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేనూ పాల్గొన్నాను. మహిళలు, వృద్ధులు, రైతులు, యువత కులమతాలకు అతీతంగా తండోప తండాలుగా మా జగన్‌గారిని మేం చూడాలంటూ ఉత్సాహంగా ముందుకు కదిలివచ్చారు. పోలీసులు నెట్టేస్తున్నా.. మా జగన్‌ను చూస్తే చాలని, మా జగన్‌ పలకరిస్తే చాలు.. ఆయన్ను తాకితే చాలంటూ ఆసక్తితో లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఇంతటి ప్రజాదరణ గలిగిన నేత దేశంలోనే ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి గారు అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.   

బాబు కుట్రలపై ప్రజలంతా అప్రమత్తం కావాలిః
చంద్రబాబు అండ్‌ కో.. తో మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఎన్నికలు పూర్తయ్యేవరకూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులతో పాటు మహిళలు, యువత, రైతులు, శ్రామికులు, వ్యాపారులంతా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, చంద్రబాబు వర్గీయులు ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడ్డానికి కుట్రలు చేస్తున్నారు. అశాంతిని, అల్లకల్లోల పరిస్థితులను సృష్టిస్తారు. అధికారం పోతుందనే బాధతో, ఆందోళనతో ఎంతకైనా తెగించే రకం ఈ నారా చంద్రబాబు నాయుడు అని ప్రతీ ఒక్కరూ మరిచిపోవద్దు. అతని నైజమే అంత. ఒకసారి ఆయన చరిత్ర తిరగేస్తే అందరికీ తెలిసిపోతుంది. 

విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా..?
జగన్‌మోహన్‌రెడ్డి గారి బస్సుయాత్ర రాయలసీమ నుంచి బయల్దేరింది. అన్ని జిల్లాల నుంచి పల్నాడు, గుంటూరు జిల్లాల్లో యాత్ర పూర్తిచేసుకుని విజయవాడలోకి రాగానే ఆయనపై రాయి పడిందంటే, అర్ధమేంటి..? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా..?  ఏంటి మీ అహంకారం..? చంద్రబాబు ప్రోత్సాహంతో జగన్‌ గారిపై ఏదో అఘాయిత్యం చేయాలని దాడి చేశారు. ఇది చాలా తప్పు. మీరు జగన్‌ గారి విషయంలో చాలా తక్కువ అంచనాలతో ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే.. విజయవాడలోనూ అన్ని పార్లమెంట్, శాసనసభ స్థానాల్లో కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తోందని తెలుసుకోండి. ఇప్పటికైనా మీ దుర్మార్గమైన రాజకీయం మానుకోండి. 

పవన్‌కళ్యాణ్‌ .. నీ కథేంటి..?
లోకేశ్‌ ఒక పిచ్చిమేళం కనుక ఆయన్ను పక్కనబెట్టండి. పవన్‌కళ్యాణ్‌ గురించి తీసుకుంటే.. జగన్‌ గారికి ఒక్క రాయి తగిలితేనే తెలుగువారికి తగిలినట్టా.. మామీద ఎన్నో రాళ్లు పడ్డాయంటున్నాడు. తెలుగు ప్రజలకు గాయం తగిలితే ఏదో ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. అసలు నువ్వేంటీ..? నీ కథ ఏంటీ..? అసలు, తెలుగు ప్రజల గురించి నువ్వు మాట్లాడే అర్హతేంటి..? జగన్‌ గారికి నీకూ ఎలా పోలుస్తావయ్యా..? నువ్వు సినిమా నటుడివని.. నువ్వేదో సినిమా ఆడతావని చూడ్డానికి జనం వస్తున్నారు. మరి, జగన్‌ గారు సినిమా యాక్టర్‌ కాదే.. ఆయన్ను చూడ్డానికి జనం ఎందుకొస్తున్నారు..? ఆయనపై ప్రేమతో వస్తున్నారని తెలుసుకో.. ఈ రాష్ట్రంలో 175 స్థానాల్లో 151 స్థానాల్ని గెలుచుకుని అధికారంలోకొచ్చిన ప్రజాదరణ గలిగినటువంటి తెలుగు నాయకుడు జగన్‌ గారని తెలుసుకో.. అలాంటి నాయకుడికి గాయం తగిలితే తెలుగు ప్రజలకు గాయం అయినట్టు కాదా..? అని అడుగుతున్నాను. 

మనోహర్ గెలిస్తే.. తెనాలి సర్వనాశనమే..
పవన్‌కళ్యాణ్‌ నిన్న తెనాలికి ఎందుకొచ్చాడో తెలుసా..? ఆ మధ్య ఆయన ఎక్కడో మాట్లాడుతూ.. నాకు మూడు పెళ్ళిళ్ళు జరిగితే, జగన్‌ గారు మాత్రం నాలుగు అంటాడేంది..? ఆ నాలుగో భార్య ఎవరూ అని అడిగారు. నాదెండ్ల మనోహర్‌నే నీ నాల్గో భార్యని అప్పట్లో నేనే చెప్పాను. కాబట్టే.. ఆ నాల్గోభార్య దగ్గరకొచ్చాడేమో..! అక్క ఆరాటమే గానీ బావ బతకడన్నట్టుగా.. తెనాలిలో నాదెండ్ల మనోహర్‌ గెలవడు. ఎందుకంటే, శ్రీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెనాలిలో గెలిచి స్పీకరయ్యాడు. అప్పట్లో ఆయన, ఆయన భార్య కలిసి తెనాలిని ఎంత దోచుకున్నారనేది ప్రతీఒక్కరీకీ తెలిసిందే. గనుక, మరో మారు ఆయన గెలిచాడంటే.. తెనాలిని సర్వనాశనం చేస్తాడని అక్కడి ప్రజలు మరవకండి. 

బాబుకు ఇంకెన్నాళ్లు దాస్యం చేస్తావ్ పవన్..?
నిన్న పవన్‌కళ్యాణ్‌ మాటల్లో కొన్ని ఆణిముత్యాలను ఆయనకే అన్వయిస్తే.. దాస్యం చేసేకంటే చచ్చిపోవడం మేలన్నాడు. అందుకే, ఆ చంద్రబాబుకు దాస్యం చేసేకంటే చచ్చిపోవడం మేలయ్యా..? అని ప్రజలంటున్నారు. బాబు మోచేతి నీళ్లు ఎందుకు తాగుతున్నావయ్యా..? ఆయన డబ్బులిస్తే పార్టీ పెట్టినోడివి.. ఇంతకన్నా దాస్యం ఏం చేస్తావయ్యా..? ఇప్పటికైనా మానుకో.. అదే, జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఎవరూ దాస్యం చేయడం లేదు. ఆయన్ను అమితంగా ప్రేమిస్తున్నారని గుర్తుపెట్టుకో. నువ్వు మాత్రం చంద్రబాబుకు దాస్యం చేస్తున్నావు. 

రాజకీయ పరిజ్ఞానం లేని తిక్కలోడు పవన్‌కళ్యాణ్ః
బీజేపీ అనేది మతతత్వ పార్టీ కాబట్టి దాంతో మేం కలిశాం కనుక ముస్లీంలంతా టీడీపీ, జనసేనకు ఓట్లు వేయకూడదనే భావనకు వచ్చినట్లు పవన్‌కళ్యాణ్‌ ఒప్పుకున్నాడు. ఆ మాట చెబుతూనే, మరి జగన్‌ గారిపై రాయి పడి తలకు గాయమైతే మోదీగారు ఖండించారు గదా.? అలాంటప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకీ ఓట్లు ఎలా వేస్తారంటూ ఈ తిక్కలోడు అంటున్నాడు. మోదీ ప్రధానిమంత్రి, జగన్‌ గారు ముఖ్యమంత్రి. అంటే, ముఖ్యమంత్రిపై రాయి వేసి గాయపరచడాన్ని ప్రధాని ఖండించారు. ఇందులో తప్పేంటి.? నీకు బుద్ధిలేదని ప్రధాని స్థాయిలో వారికి తెలియదనుకుంటున్నావా..?. రాజకీయ జ్ఞానం ఇంకెప్పుడు నేర్చుకుంటావయ్యా..? 

పవన్ అసెంబ్లీకి వస్తే.. చెప్పులు చూపిస్తాడేమో..!
ఆయన శాసనసభకు వచ్చి అందరిలా బూతులు కాకుండా అర్ధవంతమైన డిబేట్లు చేస్తాడంట. (గతంలో పవన్‌కళ్యాణ్‌ నిండు సభల్లోనే చెప్పులు చూపిస్తూ బూతులు పలికిన ప్రసంగాల వీడియోలు చూపారు ) ఒక్కసారి తమరి బూతుపురాణం మాటల్ని యూట్యూబ్‌లో చూసుకోండి. నీలాంటి బూతులు మాట్లాడే నేతల్ని పిఠాపురం ప్రజలు శాసనసభకు ఎందుకు పంపుతారనుకుంటున్నావు.? చంద్రబాబు ప్రతీచోటా జగన్‌ గారిని ఉద్దేశించి సైకో అంటున్నాడు. అసలైన సైకోలు మీరేనని మీరిద్దరూ తెలుసుకోవాలి. సైకో కాకుంటే, నువ్వు ఎప్పుడు ఊగిపోతావో తెలియదు. కాళ్లకు ఉండాల్సిన చెప్పులు చేత్తో పట్టుకుని.. ‘ నా కొడకల్లారా..’ అంటూ పలికే నువ్వొక రాజకీయ నాయకుడివా..? నీలాంటి వాడు ప్రజలకు బూతుల నాయకుల గురించి చెప్పడం హాస్యాస్పదమే. అసెంబ్లీకి నిన్ను పంపితే అక్కడ చెప్పులు తీసి చేతపట్టుకుంటావా..? చంద్రబాబు చెప్పులు మోస్తావో.. చెప్పవయ్యా కొణిదెల పవన్‌కళ్యాణ్‌..? నువ్వా మాకు నీతులు చెప్పేది..? మేమెప్పుడూ అసెంబ్లీలో బూతులు తిట్టలేదు. మేమేదో బూతులు తిట్టామని భావించి మాత్రమే చంద్రబాబు బావురమని ఏడ్చాడు. 

బాబుపైనా రాళ్లు పడ్డాయంట.. గాయాల్లేవంటః
ఇక, చంద్రబాబు మీద కూడా రాళ్లేశారంటూ ఈనాడులో రాయించుకున్నారు. అంటే, జగన్‌ గారిపై రాయి వేసి గాయపరిస్తే.. వాళ్లు మా మీద కూడా రాళ్లు పడ్డాయని చెబుతున్నారు. నిజంగా, మీ మీద రాళ్లు పడితే గాయాలు తగలలేదేం..? ఈనాడు రామోజీరావు ఇచ్చిన సలహా మేరకు మీరు చేసేదే అసలైన నాటకం. ఈ రాష్ట్ర ప్రజలను అంత అమాయకుల్ని చేసి మీరు ఏదిబడితే అది చేస్తామనుకుంటే.. మీ పప్పులుడకవు. ఏది నాటకమో.. ఏది నిజమో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. 

పిఠాపురంలో గెలవలేవు.. సినిమాలకూ పనికిరావుః
ఇక, పవన్‌కళ్యాణ్‌ నా గురించి మాట్లాడుతూ.. పోలవరం గురించి మాట్లాడితే నేను అబ్బనీ .. తీయని దెబ్బని పాట పాడుతానంట. నీ సొంత అన్నయ్య చిరంజీవి పాటను నేను పాడానని అనడానికి సిగ్గుగా లేదా..? నీ సినిమాలో శ్యాంబాబు అంటూ పాట పెట్టావు. ఆ పాటకు నేనిచ్చిన కౌంటర్‌కు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్‌ అయ్యింది. నేను సినిమాల్లోకొస్తే నీ పీడ విరగడయ్యేది. నన్ను చూస్తే.. ఇక నిన్నెవరూ చూసేవాళ్లు ఉండరు. అయినా.. నాకు సినిమాలు ఇంట్రెస్ట్‌ లేదు. అదే, నీకు మాత్రం అటు సినిమాలు కావాలి. ఇటు రాజకీయాలు కూడా కావాలి. కానీ, ఒక్క విషయం తెలుసుకో.. నీ బాడీషేప్‌ కూడా మారింది. ఇకనువ్వు సినిమాల్లో పనికిరావు. రాజకీయాల్లో ఎదగలేకపోయావని.. చంద్రబాబును పైకి లేపలేకపోతున్నావనే దిగులుతో బాధపడుతున్నావు. పిఠాపురంలోనూ నువ్వు గెలవలేవు. రేపు ఎన్నికల కౌంటింగ్‌ తర్వాత పవన్ కల్యాణ్ కు రాజకీయంగా సమాధి తప్పదు. 

జగన్‌గారిపై మీరు రాళ్లేస్తే.. ప్రజలు ఓట్లేస్తారుః
అశేష జనాదరణ గలిగిన నేతగా శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు అండ్‌ కో రాళ్లు వేసి గాయపరచాలనుకుంటే.. రేపటి ఎన్నికల్లో ప్రజలు మీ కుట్రలకు దీటుగా ఓట్లేస్తారని మరిచిపోకండి. అత్యంత ప్రజాదరణ ఉన్న ఆయన్ను ఎలా కాపాడుకోవాల్నో.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎలా తెచ్చుకోవాలో ప్రజల్లో చాలా క్లారిటీ ఉంది. చంద్రబాబు వర్గీయుల కుట్రలు ఫలించవు. చంద్రబాబుకు, ఆయనతో పాటు ఉన్న కూటమి నేతలందరికీ రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిస్తున్నాను. 
 

Back to Top