ఉత్తరాంధ్రకు ఈ ప్రాంత టీడీపీ నేతలు వెన్నుపోటు 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్  

 ఉత్తరాంధ్రను కాదని అమరావతిని అభివృద్ధి చేయాలనడానికి మీకు సిగ్గు లేదా..?
 
ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కార్యక్రమాలు మానండి: టిడిపి నేతలకు మంత్రి అమర్నాథ్ హితవు 

ఉత్తరాంధ్రపై దుష్ప్రచారమే మీ లక్ష్యమా?

 ఈ ప్రాంత బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బ తీయడమే ఉద్దేశమా?

ఇది డ్రగ్స్‌కు ఒక నిలయం అని చెప్పదల్చుకున్నారా?

తెలుగుదేశం పార్టీకి మంత్రి అమర్‌నాథ్‌ సూటి ప్రశ్న

ఏం ఉద్ధరించారని ఉత్తరాంధ్రలో కార్యక్రమాలు?

ఏనాడైనా ఈ ప్రాంతాన్ని అసలు పట్టించుకున్నారా?

మీ రాజకీయ ముఖచిత్రంలో ఈ ప్రాంతం ఉందా?

టీడీపీని గట్టిగా నిలదీసిన మంత్రి అమర్‌నాథ్‌

ఇక్కడ గెల్చారు. అధికారం, పదవులు పొందారు

మళ్లీ ఈ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు వెన్నుపోటు

ఇక్కడ ఏమీ వద్దు.. అన్నీ అమరావతిలోనే అంటున్నారు

అందుకే మీ వైఖరి మార్చుకొండి

ఇక్కడ తలపెట్టిన కార్యక్రమాలు విరమించుకోండి

ప్రెస్‌మీట్‌లో టీడీపీ నేతలకు మంత్రి అమర్‌నాథ్‌ సూచన

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడి వారికి ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నార‌ని  రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిప‌డ్డారు. ఈ ప్రాంతం వెనకబడి ఉందని అంటారు. ఇన్నాళ్లూ దీన్ని ఎవరూ పట్టించుకోలేదని అంటారు. చంద్రబాబు 14 ఏళ్లు, ఎన్టీ రామారావుగారు 7 ఏళ్లు పాలించినా.. ఇక్కడ ఏం చే«శారని చెప్పడానికి లేదు. ఉత్తరాంధ్ర వెనకబడి ఉందంటూనే, మొత్తం అమరావతిలోనే అభివృద్ధి చేయాలని టీడీపీ నేతలు అంటున్నారు. మరోవైపు కొత్తగా వారికి సమస్యలు గుర్తొచ్చాయట. అందుకోసం రేపటి నుంచి 5 రోజుల పాటు వరసగా కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఇక్కడ మూడు రోజులు పర్యటిస్తారట. ఇక్కడ ఒక చర్చ పెట్టి, మా ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అన్ని అక్రమాలు చేస్తోందని చెబుతారట. తాము మళ్లీ అధికారంలోకి వస్తే, అన్నీ చేస్తామని చెబుతారట అని అన్నారు. విశాఖపట్నం సర్క్యూట్‌ హౌస్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. 

బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బ తీస్తారా?:
    రుషికొండ, విశాఖ భూములు, గిరిజన ప్రాంతాల్లో మైనింగ్‌ మాఫియా, మైనింగ్‌తో పాటు, గంజాయి సాగు అంశాలు.. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో హీర మండంలో గొట్టా బ్యారేజీ పనులు.. వాటిపై 5 రోజుల పాటు కార్యక్రమాలు. వాటితో పాటు షుగర్‌ ఫ్యాక్టరీలు. ఆ 5 కార్యక్రమాల కోసం బృందాలుగా ఏర్పడి, ఎక్కడికక్కడ కార్యాచరణ చేస్తారట.
    అంటే వారి ఉద్దేశం ఏమిటంటే.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం గంజాయి సాగుకు అడ్డా. డ్రగ్స్‌కు ఒక నిలయం. అదీ వారి ఉద్దేశం. ఆ విధంగా వారు ఉత్తరాంధ్ర ప్రాంత బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసి, అమరావతిలోనే పెట్టుబడులు పెట్టాలన్న వారి ప్రయత్నం.

వెన్నుపోటు పొడుస్తున్నారు:
    అంటే ఇక్కడే పుట్టి, ఇక్కడి నుంచే ఎదిగి, తిరిగి ఈ ప్రాంతానికి, అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం. ఎందుకు చంద్రబాబునాయుడు బూట్లు నాకుతున్నారు?
    అనేక సందర్భాలలో టీడీపీ అధికారంలోకి రావడానికి ఉత్తరాంధ్రనే కారణం. ఇక్కడి వారు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారు. కానీ ఇక్కడి వారిపై మీకు అభిమానం లేదు. వారి పట్ట కృతజ్ఞత లేదు. ఉత్తరాంధ్ర అంటే దేనికీ ఉపయోగపడని ప్రాంతం. ఇక్కడ గంజాయి సాగు చేస్తారని చెప్పే ప్రయత్నం. దీనికి ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
    మీ పార్టీ అధ్యక్షుడు ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి. కానీ ఆయన కూడా ఇక్కడ ఏమీ వద్దంటున్నారు. అలాంటి నాయకుడిని ఎక్కడైనా చూశామా?
ఇక్కడి నాయకులు కానీ, ప్రజలు కానీ ఎవరూ కూడా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. అమరావతితో పాటు, ఇక్కడ కూడా అభివృద్ధి కావాలంటున్నారు. కానీ ఏదో ముద్ర విశాఖ, ఉత్తరాంధ్ర మీద వేపి, ఇక్కడ ఏదీ అనుకూలం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్ర ఆగిపోవడంతో ఈ పని చేస్తున్నారు. మొన్న ప్యాకేజీ స్టార్‌ను తీసుకొచ్చి డ్రామా చేశారు. 

అక్కడ నిర్మాణాలు జరిగితే తప్పేమిటి?:
    ఇక్కడ రుషికొండ మీద తప్ప, ఏ కొండ మీద నిర్మాణాలు లేవా? రుషికొండ మీద ఒక గెస్ట్‌హౌజ్‌ కట్టినంత మాత్రాన, రాజధాని ఇక్కడికి వచ్చేస్తోందా? అమరావతితో ఏమీ ఉండదు అంటూ ప్రచారం. తమ అనుకూల మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం. అసలు రుషికొండ మీద నిర్మాణాలు జరిగితే తప్పేమిటి? అక్కడ చెట్లు కొట్టి, బిల్డింగ్‌లు కడుతున్నారంటున్నారు. ఎక్కడైనా చెట్ల మీద ఇళ్లు కట్టలేం కదా? బిల్డింగ్‌లు కట్టిన తర్వాత గ్రీనరీ కవర్‌ చేస్తారు.
    వారి ఉద్దేశం ఒక్కటే. విశాఖలో ప్రభుత్వానికి సంబంధించి ఒక్క నిర్మాణం కూడా ఉండకూడదు. ఏది కట్టినా జగన్‌గారు వచ్చి ఉంటారు. దాంతో రాజధాని తరలి వస్తుంది. దాంతో అమరావతిలో భూముల ధరలు తగ్గుతాయి. అదే వారి బాధ. అదే కదా మీ ఆక్రోషం. ఇవాళ మొత్తం లక్ష కోట్లు ఒక్క అమరావతిలోనే పెట్టమనేదే కదా వారి కోరిక. అలా చేస్తే, వారి భూములు ధరలు పెరుగుతాయి. అదే చంద్రబాబుతో సహా, వారందరి అభిప్రాయం. ఇదే కదా వాస్తవం? కాదంటారా చెప్పండి.

ఇక్కడ రాజధాని ఉండకూడదా?:
    ఇవాళ విశాఖకు రాజధాని వస్తే.. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. విమానాశ్రయం ఉంది. హైవే కనెక్టివిటీ, రైల్వే లైన్‌ ఉంది. పోర్టు ఉంది. అన్ని సదుపాయాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ రాజధాని కావాలంటున్నాం. మరి అమరావతిలో ఏం సదుపాయాలు ఉన్నాయి? ఎందుకు అక్కడ రాజధాని కావాలంటున్నారు. అక్కడ ఏ సదుపాయాలున్నాయో చెప్పండి. ఏమన్నా అంటే, భూములు ఇచ్చాం కాబట్టి రాజధాని కావాలంటున్నారు. అదేం వాదన?
    మేము అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని మారుస్తామని చెప్పడం లేదు కదా? ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నాం కదా? ప్రపంచంలో ఎక్కడైనా ఆరు నెలలు, ఏడాదిలో నగరాల నిర్మాణం జరిగిందా? దేనికైనా తగిన సదుపాయాలు, వనరులు ఉండాలి. అప్పుడే నగరాలు కూడా క్రమంగా పెరుగుతాయి. అంతే తప్ప, నగరాల నిర్మాణం అనేది ఎక్కడా జరగదు.

త్యాగం అంటే అది:
    విశాఖలో కూడా స్టీల్‌ ప్లాంట్‌తో పాటు, అనేక సంస్థలు, పరిశ్రమలకు ఇక్కడి రైతులు భూములు ఇచ్చారు. వారెవ్వరూ స్వార్థం కోసం కాదు. రాష్ట్రం కోసం ఇచ్చారు. దాన్ని త్యాగం అంటారు. అంతేకానీ, అమరావతిలో స్వార్థం కోసం భూములు ఇచ్చారు. వారి కోసం టీడీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అందుకే ఉత్తరాంధ్ర ప్రాంతంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ గంజాయి సాగు అంటూ ప్రచారం చేస్తున్నారు.

మీ హయాంలో అన్నీ అక్రమాలే:
    నిజానికి గతంలో ఇక్కడ గంజాయి సాగు చేసింది మీ పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడు. ఆ వి«ధంగా దోపిడీలు, అక్రమాలు ఎన్నో చేశారు. ఇంకా మీ హయాంలో ప్రభుత్వ రికార్డులు మార్చి, యథేచ్ఛగా భూకబ్జాలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 400 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నాం. అవన్నీ గీతం వర్సిటీతో సహా, టీడీపీ నాయకులు అధీనంలో ఉన్నవే.కానీ ఇవాళ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక వెన్నుపోటుదారుడు నాయకత్వం వహిస్తున్న పార్టీలో ఉన్న వారికి కూడా అవే లక్షణాలు ఉంటాయి కదా? అందుకే ఇక్కడి నుంచి పదవులు పొంది, అధికారం చలాయించి, తిరిగి ఈ ప్రాంతం వారికే వెన్నుపోటు పొడుస్తున్నారు.
    ఇక్కడి షుగర్‌ ఫ్యాక్టరీ కోసం కార్యక్రమం పెట్టుకున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో ఎన్ని షుగర్‌ ఫ్యాక్టరీలు మూతబడ్డాయి? ఆయన హయాంలో మొత్తం 74 సంస్థలు మూతబడ్డాయి.

అందుకే ఆ ఆలోచన:
    ఇంకా ఉత్తరా«ంధ్ర ప్రాంతంలో దాదాపు 5 షుగర్‌ ఫ్యాక్టరీలు ఉంటే.. తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ. ఇది విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉంది. అదే విధంగా ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ. రోజుకు 1800 టన్నుల కెపాసిటీ. వాటికి ఒక సీజన్‌లో అంటే దాదాపు 130 రోజుల క్రషింగ్‌కు, రోజుకు 1800 టన్నుల చొప్పున కావాల్సిన చెరుకు 2.34 లక్షల టన్నులు. కానీ అక్కడ అందుబాటులో ఉన్న చెరుకు 12 వేల టన్నులు మాత్రమే. దాదాపు 600 ఎకరాల్లో మాత్రమే చెరుకు సాగు చేస్తున్నారు. అంటే ఏ మాత్రం సరిపోను చెరుకు సాగు జరగడం లేదు. అందుకు రైతులు సిద్ధంగా లేరు.     అందుకే వాటి స్థానంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలని సీఎంగారు యోచిస్తున్నారు. దానిపైనా టీడీపీ ఆందోళన చేస్తానంటోంది.

కీడు తలపెట్టొద్దు:
    ఆముదాలవలస షుగర్‌ ఫ్యాక్టరీ ఎప్పుడో మూత బడింది. మరి గత 5 ఏళ్ల పాలనలో వాటిని తిరిగి తెరిచే ప్రయత్నం ఎందుకు చేయలేదు?
అంటే ఇవన్నీ కూడా కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను వెన్నుపోటు పొడవాలి. అమరావతి నుంచి రైతుల పేరుతో వస్తున్న వారికి కొమ్ము కావాలి. చంద్రబాబుకు బంట్రోతులుగా పని చేయాలి. తద్వారా ఆయన దగ్గర మార్కులు పొందాలన్న ప్రయత్నం. దాన్ని మానుకోవాలి.
    మీరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు మేలు చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కీడు తలపెట్టొద్దు. అని విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే మీ రాజకీయ పరమైన ఎజెండాతో ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం మానుకోమని కోరుతున్నాం.
    చంద్రబాబు రాజకీయ ముఖచిత్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతం లేనే లేదు. ఆయనకు లేదు. ఆయన దత్తపుత్రుడికీ లేదు. ఇద్దరికీ తమ రాజకీయ ముఖచిత్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ లేనే లేదు. ఒక్క అమరావతి తప్ప. వారికి రాష్ట్రం అంటే అమరావతి. 29 గ్రామాలు మాత్రమే.
అందుకే ఇప్పటికైనా మరొకరి కోసం ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు ఫణంగా పెట్టి, వారి బూట్లు నాకొద్దని కోరుతున్నాం.

 ప్రభుత్వ భవనాల నిర్మాణం:

    రుషికొండ మీద ప్రభుత్వ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎవరూ సొంత భవనాలు కట్టుకోవడం లేదు. అసలు ఈనాడు పత్రిక పుట్టింది విశాఖలో. ఇప్పుడు రోజూ విషం చిమ్ముతూ కధనాలు రాస్తున్నారు. రుషికొండ మీద ఏపీ టూరిజమ్‌ గురించి నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతోందని విపక్షాలు వెళ్లాలనుకుంటున్నాయి?
అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలు జరిగితే వారు ఎందుకు భయపడుతున్నారు? అక్కడ ప్రభుత్వం బిల్డింగ్‌ కడితే, తప్పేమిటి?
అంటే అక్కడ ఏదీ కట్టవద్దని ఎందుకు అంటున్నారు? అక్కడ ఏం కట్టినా, అది కేవలం రాజధాని కోసం అని ఎందుకు అనుకుంటున్నారు?

ఎందుకు దుష్ప్రచారం?:
    ఎవరేం చెప్పినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఏం మాట్లాడినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కాకుండా ఆపలేరు. రుషికొండపై టూరిజమ్‌ బిల్డింగ్‌ కడితే ఎందుకు తప్పు పడుతున్నారు? అక్కడ ఏదో జరుగుతోందని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. 2023 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌. అదే చెప్పాం. అదే జరుగుతుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top