మత్స్యకారుల వలసలు తగ్గించడమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు  

ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలేం హార్బర్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన మంత్రి

శ్రీకాకుళం:  మత్స్యకారుల వలసలు తగ్గించి స్థానికంగా ప‌నులు క‌ల్పించ‌డ‌మే ప్రభుత్వ ధ్యేయమ‌ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు  అన్నారు.  మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో హార్బర్ లు నిర్మాణం  ప్రభుత్వం చేపడుతుందని మంత్రి తెలిపారు. శుక్ర‌వారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలేంలో స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, స్ధానిక నాయకులు, మత్స్యకార జిల్లా నాయకులతో కలిసి ప్రభుత్వం చేపట్టబోయే హార్బర్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేశారు.

 ఈ సందర్భంగా  మంత్రి డాక్టర్ సీదిరి అప్ప‌ల‌రాజు మాట్లాడారు.. గత ప్రభుత్వాలు మత్స్యకారులను నిర్లక్ష్యం చేశారని ఆవేదన చెందారు. రాష్ట్రంలో తొమ్మిది వందల కిలోమీటర్లకు పైబడి తీరప్రాంతం ఉందని అందులో శ్రీకాకుళం జిల్లాలో 194 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉన్నదని ఈ తీర ప్రాంతంలో ఎన్నో వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. వారు సముద్రంలో చేపల వేటనే నమ్ముకుని బ్రతుకుతున్నారని అన్నారు. అలాంటి వారి బ్రతుకుల్లో వెలుగు నింపాలని ఉద్దేశం గత పాలకులకు లేదని అందుకే రాష్ట్రంలో రెండు హార్బర్ లు మాత్రమే ఉండేవని చెప్పారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారని, ఆ పాదయాత్రలో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల బాధ‌లు విన్నారని అన్నారు. అప్పుడే జగనన్న మన ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు తొమ్మిది హార్బర్ లు నిర్మాణం చేపడుతూ ఆ హామీలు నిలబెట్టకున్నామని మంత్రి చెప్పారు. వాస్తవానికి బుడగట్లపాలెం  హార్బర్ 340 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతుందని అందులో కేంద్ర ప్రభుత్వం 120 కోట్ల రూపాయల వరకు నిధులు ఇస్తుందని మిగతా నిధులన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుందని అన్నారు. 

శ్రీకాకుళం జిల్లానుంచి వలస పోతూ ఇతర జిల్లాల్లో, రాష్ట్రాలలో, దేశాలలో పనిచేసుకుంటూ బతుకున్న మత్య్సకారులు కరోనా సమయంలో ఎంతో ఇబ్బందులు పడ్డార‌ని, ఆ సమయంలో తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అని తెలిపారు. స్థానికంగా పని‌చేసుకునే అవకాశం క‌ల్పించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం హార్బర్ లు నిర్మాణం చేపట్టడంతో మత్స్యకారుల కష్టాలు తొలగి పోతాయని  ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు భరోసా అవుతున్న జగనన్నకు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. నెల్లూరు జిల్లా జువ్వదిండు దగ్గర 85 శాతం పనులు పూర్తి చేసుకున్నామని అన్నారు. నిజాంపట్నం జిల్లా వద్ద 50శాతాం పనులు పూర్తి అయ్యాయని.  మచిలీపట్నం దగ్గర నిర్మాణం అవుతున్న హార్బర్ పనులు 70 శాతం పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. 

విజయనగరం చింతపల్లి , విశాఖపట్నం భీమిలి తో పాటు  రాజయ్య పేట,శ్రీకాకుళం నువ్వలరేవు మంచినీళ్ళపేట   దగ్గర ఒక  ప్లోటింగ్ జట్టి నిర్మాణ చేపడుతున్నామని అన్నారు. అయితే మంచినీళ్ళపేట వద్ద ఏదైతే జట్టీ నిర్మాణం జరుగుతుందో దాన్ని పూర్తి స్థాయి హార్బర్ నిర్మాణం చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులతో పూర్తి స్థాయి హార్బర్ గా మార్చుకోబోతున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు హార్బర్ లు పూర్తి అయితే మత్స్యకారుల వలసలు వందకు వంద శాతం నివారింపబడతాయని మంత్రి అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర దేశం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 65 సంవత్సరాలు అయ్యింది ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు మత్స్యకారుల వలసలు , సంక్షేమం కోసం ఊకదంపుడు ఉపన్యాసం చేస్తునే ఉండేవారు. కానీ ఏ రోజు కూడా మత్స్యకారులు బాగోగులు చూసే నాయకుడు రాలేదు. వారి కష్టం ఎరిగి వారి కోసం ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి అని నేను బల్లగుద్ది చెప్పగలను అని అన్నారు. రాష్ట్రంలో 3500 కోట్ల రూపాయలతో తీరప్రాంతంలో శాశ్వతమైన పనులను యుద్ద ప్రాతిపదికన మత్స్యకారుల కోసం  చేపడుతున్నామ‌ని తెలిపారు. ఈ విషయాన్ని మత్స్యకారులు అందరూ గమనించాలని, మన బ్రతుకులకు ఒక భరోసా ఇచ్చిన నాయకుడు శాశ్వతంగా ముఖ్యమంత్రి గా కొనసాగేలా ఉండాలని మనమందరం ఆశీర్వదించాలని కోరారు. 

 దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు పోర్టులు నిర్మించారని గుర్తు చేశారు. మ‌హానేత‌ మరణాంతరం వచ్చిన ఏ ముఖ్యమంత్రి పోర్టులు నిర్మాణం చేపట్ట లేదని తెలిపారు. తండ్రి ఆశయ సాధన కోసం దృడమైన లక్ష్యం తో పని చేస్తున్న మన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడు(మూలపేట) పోర్టులకు పూర్తి స్థాయి పనుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం చూస్తే వైయ‌స్ జ‌గ‌న్ లక్ష్యం ఎంతటిదో అర్ధం చేసుకోవాలని అన్నారు. భావనపాడు పోర్టు కోసం నా చిన్నతనం నుంచి ఎంతో మంది చెప్పిన మాయమాటలు విన్నానని కానీ ఒకే ఒక్క నాయకుడు ఆ దిశగా ప్రయత్నం చేసి పోర్టు నిర్మాణం కోసం నిధులు వెచ్చించారని ఆయనే మన జగనన్న అని మంత్రి తెలిపారు.

 ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు పేద ప్రజల పట్ల ఉన్న ప్రేమ, వారి కష్టాల పట్ల  అవగాహన ఉంద‌న్నారు.  పేద ప్రజల కోసం మంచి చేయాలని ఒక సంకల్పంతో పని చేస్తున్నారని తెలిపారు. ఒక మత్స్యకారుడునైన నాకు అలాంటి ఒక గొప్ప వ్యక్తితో పనిచేసే అవకాశం దొరికినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన లక్ష్య సాధన కోసం మరింత కష్టపడి పేద ప్రజల సంక్షేమం కోసం పని‌చేస్తామని అన్నారు. జగనన్న ప్రణాళికలు శ్రీకాకుళం జిల్లాని వలసలు లేని జిల్లాగా మార్చుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, జాయింట్ కలెక్టర్, స్ధానిక నాయకులు, మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top