ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన విద్యార్థుల్లో ఆనందం

అమరావతి: ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా గిరిజన విద్యార్థులకు ఆయూష్‌లో పీజీ సీట్లలో చోటు కల్పిస్తూ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో ఆయూష్‌ పీజీ సీట్లలో గిరిజన రిజర్వేషన్లు అమలు కాలేదు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఒక సీటు, తిరుపతి కళాశాలలో రెండు సీట్లను గిరిజనులకు కేటాయించింది. 

 

Read Also: ఎంత ఎగిరిపడినా.. ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు

Back to Top