కాసేపట్లో వైయస్‌ షర్మిల బస్సు యాత్ర

గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల బస్సు యాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఆ తరువాత మంగళగిరిలో రైతులతో వైయస్‌ షర్మిల ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం బస్సు యాత్ర ద్వారా గుంటూరుకు చేరుకుంటారు. 
 

Back to Top