సోషియో ఎక‌నామిక్ స‌ర్వే రిలీజ్‌

అమ‌రావ‌తి: శాసనసభలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో సోషియో ఎకనామిక్‌ సర్వే ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రిలీజ్ చేశారు. 2022–2023 సామాజిక ఆర్థిక సర్వే వివరాలను  ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. ప్రగతిలో ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. రూ.13.17 లక్షల కోట్లు జీఎస్‌డీపీ నమోదు అయినట్లు ప్రణాళిక కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్‌డీపీ పెరిగిందన్నారు. 36 శాతం కంట్రీబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోందని చెప్పారు. 64 శాతం కంట్రీబ్యూషన్‌ పరిశ్రమలు, సర్వీస్‌ సెక్టార్ల నుంచి వస్తుందన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తుందని సర్వే చెప్పినట్లు తెలిపారు. ఆలిండియా యావరేజీ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైందని చెప్పారు.  వ్యవసాయంలో వృద్ధి 13.8 శాతం, పరిశ్రమలో వృద్ధి 16.36 శాతం నమోదు అయినట్లు తెలిపారు. సేవా రంగంలో వృద్ధి 18.91 శాతం నమోదు..విద్య, ఆరోగ్య రంగాల్లో అనూహ్య అభివృద్ధి సాధించినట్లు వెల్లడించారు. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని వివరించారు.
 

Back to Top