నేడు కురుపాం, మచిలీపట్నంలో సామాజిక సాధికార యాత్ర

తాడేప‌ల్లి: రాష్ట్రంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన మంచిని వివ‌రించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నేడు కృష్ణా జిల్లా మచిలీపట్నం, పార్వ­తీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బ‌స్సు యాత్ర జరగనుంది. 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి మున్సిప‌ల్ ఆఫీస‌ర్ వ‌ర‌కు ర్యాలీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఆఫీస్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. బ‌హిరంగ స‌భ‌కు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు హాజరుకానున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు నందివానివలసలో వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటలకు పెదమేరంగి, సీమనాయుడువలస మీదుగా బైకు ర్యాలీ జరగనుంది. 3 గంటలకు కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్‌లో  జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు సీదిరి అప్పలరాజు తదితరులు పాల్గొననున్నారు.

Back to Top