అర్హ‌తే ప్రామాణికం..సంక్షేమ ఫ‌లాలు అంద‌రివీ

 రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు
 

గార మండలంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం

శ్రీ‌కాకుళం :    వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అర్హ‌తే ప్ర‌మాణికంగా వివ‌క్ష‌కు తావులేకుండా సంక్షేమ ఫ‌లాలు అందరికీ అంద‌జేస్తున్నామ‌ని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సంక్షేమ ప‌థ‌కాల  అమ‌లు వెనుక ఉన్న ఉద్దేశాన్ని, సంబంధిత ల‌క్ష్యాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ అర్థం చేసుకుని, మేలుకోరే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని కోరారు. గార మండ‌లంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక స‌మస్య‌లు అడిగి తెలుసుకున్నారు. వీలున్నంత వ‌ర‌కూ వీటి ప‌రిష్కారానికి సత్వ‌ర చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స‌చివాల‌య ప‌రిధిలో ఇర‌వై ల‌క్ష‌ల రూపాయ‌లు మంజూరు చేశామ‌ని,వీటితో త‌క్ష‌ణం అవ‌సరం ఉన్న ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని సూచించారు. ముఖ్యంగా వ‌లంటీర్లు మ‌రింత నిబద్ధ‌త‌తో ప‌నిచేయాల‌ని, గ్రామ స‌చివాల‌య  వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా స‌మ‌ష్టి కృషితో ప‌ని చేయాల‌ని సూచించారు. 
మంత్రి ఇంకా ఏమ‌న్నారంటే...
- ఎన్నిక‌ల‌కు ముందు మ‌న ప్రాంతానికి వ‌చ్చిన‌ప్పుడు చెప్పినవ‌న్నీ చేశాం. సంబంధిత హామీల మేర‌కు ప‌థ‌కాల అమ‌లు జ‌రిగాక వాటిని అందుకున్న‌వారి అభిప్రాయం ఏంటి అన్న‌ది తెలుసుకునేందుకే ఇక్క‌డికి వ‌చ్చాను.

- ప్ర‌తి స‌చివాల‌యం ప‌రిధిలో రెండు రోజుల చొప్పున పార్టీ నాయ‌కులూ, కార్య‌క‌ర్త‌లూ తిరిగి ల‌బ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు, ఇంకేమ‌యినా స‌మ‌స్య‌లు ఉంటే వాటిని పరిష్క‌రించేందుకు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నాం.
- ఇది ఒక మంచి ప్ర‌య‌త్నం. ఎన్నిక‌ల‌కు ముందు ఫ‌లానా ప‌నులు చేస్తామ‌ని చెప్పాం. ఆ మాట‌లు విని మీరు ప్ర‌జా తీర్పు ఇచ్చారు. నాటి మాట‌లు నిల‌బెట్టుకుని, సంబంధిత ప‌థ‌కాలు అమ‌లు చేయడం జరిగింది.. అదేవిధంగా నాడుచంద్రబాబు మాకు ఓటేయండి డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సంబంధించి ఉన్న బ్యాంకు రుణాలు అన్నీ తీర్చేస్తాం అని చెప్పారు. క‌ట్టారా ? కానీ ఆరోజు మ్యానిఫెస్టోలో చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు.  ఆ మాట‌లు న‌మ్మారు కొంద‌రు. ఆయ‌న పార్టీకి ఓటేశారు. అవ్వ‌లేదు కానీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 4 విడ‌త‌లుగా మీ రుణాలు చెల్లిస్తాన‌ని మాట చెప్పారు. ఎన్నిక‌ల హామీని ఇవాళ నిల‌బెట్టుకున్నారు. మీరు మ‌ళ్లీ బ్యాంకు మెట్లు ఎక్క‌కుండా గౌర‌వాన్ని మీకు క‌ల్పిస్తాను. ఆ మాట ప్ర‌కారం ఇప్ప‌టికే మూడు సార్లు డ్వాక్రా రుణాల‌కు సంబంధించి చెల్లింపులు చేశారు. మ‌ళ్లీ మీ ప‌ర‌ప‌తిని పెంచారు. స‌కాలంలో రుణాల చెల్లించ‌క ఆ రోజు ప‌డిన ఇబ్బందులు అన్నీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి తీర్చేశారు.

- అదేవిధంగా రైతాంగాన్నీ అందుకున్నారు. అనుకున్న విధంగా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌కు గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. అవినీతి లేని పాల‌న చేస్తామ‌ని ఆ రోజు ఎన్నిక‌ల ముందు చెప్పాం. త‌రువాత అధికారంలోకి వ‌చ్చాక ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి  సంబంధిత మాట నిల‌బెట్టుకునే విధంగానే పాల‌న అందిస్తూ వస్తున్నాం.పాల‌న‌లో మార్పు అంటే ఇదే క‌దా ! అవినీతి లేకుండా, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తూ.. చేస్తున్న పాల‌నలో మీరు గ‌మ‌నించాల్సిన విష‌యాలు ఇవే..! అర్హులంద‌రికీ వివ‌క్ష లేకుండా ప‌థ‌కాలు అందించ‌డం అన్న‌దే ప్ర‌ధానం అయిన మార్పు.

 తెలుగుదేశం పార్టీ నేత‌లు ధ‌ర‌లు పెరిగాయ‌ని ప్ర‌చారం చేస్తున్నారు.  ధ‌ర‌లు పెరిగిన మాట నిజ‌మే, ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే ,  గ్యాస్ ధ‌ర పెరిగింది. ఎవ‌రు పెంచారు ?  కేంద్ర ప్ర‌భుత్వం పెంచింది.  పె ట్రోలు, డీజిలు ధ‌ర‌లు ఎవరు నిర్ణ‌యిస్తారు.
కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. మ‌న ద‌గ్గ‌ర కొన్ని ధ‌ర‌లు పెరిగాయి.. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగాయి. నూనెల ధ‌ర‌లు పెరిగాయి.. మ‌రి ! ఈ ధ‌ర‌లు ఇక్క‌డే ఉన్నాయా? లేదా ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా ఇదే విధంగా ఉన్నాయా ? అంటే ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా ధ‌ర‌లు  ఇదే విధంగా ఉన్నాయి అన్న స‌మాధానమే వ‌స్తుంది. యూపీలోనూ, ఒడిశాలోనూ, కేర‌ళ‌లోనే ఇలా అన్ని చోట్ల 
తెలంగాణ‌లోనూ, మధ్య‌ప్ర‌దేశ్ లోనూ ఇదే విధంగా ధ‌ర‌లున్నాయి. ఇవ‌న్నీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన‌వి కావు. ప్ర‌త్యేకంగా దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏమీ ధ‌ర‌లు పెరిగిపోలేదు. ఈ విష‌యాన్ని మీరు గ‌మ‌నించాలి. చంద్ర‌బాబు చెప్ప‌డానికేమీ లేక, ఈ పాల‌న‌ను విమ‌ర్శించడానికి ఏమీ లేక ధ‌ర‌ల విష‌య‌మై విప‌క్ష నేత చెప్పిన‌టువంటి అబ‌ద్ధ‌పు మాట‌లివి. అభివృద్ధి జ‌ర గ‌లేదు అని అంటున్నారు కానీ నాడు నేడు పేరిట స్కూల్ బిల్డింగులు ఎక్క‌డివి ? ఆర్బీకే లు ఎక్క‌డివి ? వెల్నెస్  సెంట‌ర్లు ఎక్క‌డివి ? డ‌బ్బంతా ఆయ‌నేం (చంద్ర‌బాబును ఉద్దేశిస్తూ) చేశారు..ఆయ‌న పాల‌న‌లో దుర్వినియోగం చేశారు.  కొంత‌మంది వ్య‌క్తుల‌ను ధ‌న‌వంతుల్ని చేయాల‌న్న‌దే ల‌క్ష్యంగా పెట్టుకున్నారాయ‌న‌. నాటి టీడీపీ హ‌యాంలో రాష్ట్ర నుంచి గ్రామ స్థాయి వ‌ర‌కూ ర‌క‌ర‌కాల క‌న్సెల్టెన్సీలు పెట్టి రాష్ట్ర ఆదాయాన్ని అంతా తినేశారు. నిన్న కూడా అవినీతి లేకుండా పాల‌న అందించాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశాలు అందించారు. బ్రోక‌ర్ల రాజ్యం అంతా ఒక్క‌సారిగా పోయింది. హాయిగా మేం అందించే ప్ర‌తి పైసా మీకు నేరుగా మీ ఖాతాల్లోకే జ‌మ అయిపోతున్నాయి. ఇంక మ‌ధ్య‌వ‌ర్తుల‌తో ప‌నేముంది? వీటన్నింటి గురించి తెలుసుకోండి.. అని అన్నారు. 
- వృద్ధుల‌కు భ‌రోసా ఇచ్చాం.  అదేవిధంగా ఇల్లాలి ఆత్మ‌గౌర‌వాన్ని పెంచాం. జీవ‌న ప్ర‌మాణాలు పెంచాం. వ్య‌వ‌సాయ దారుడికీ ఏటా 13500 పెట్టుబ‌డి సాయం అందించాం. అమ్మ ఒడి పేరిట ఏటా రూ.15 వేలు అందజేస్తున్నామని అన్నారు

● గార నుంచి సచివాలయం నుంచి రైతు భ‌రోసా కేంద్రం, జగనన్న కాలనీ మీదుగా కర్ణాలపేటకి సీసీ రోడ్ మంజూరు చేశారు. 
గార వద్ద ఎత్తిపోతల పథకం పూర్తికి, గార వద్ద బ్రిడ్జి పూర్తికి కృషి.సీసీ రోడ్ కి 20 లక్ష‌లు మంజూరు చేశారు. అందులోనే 
యాతపేటకూ ర‌హ‌దారి వేయాల‌ని సంబంధిత యంత్రాగానికి ఆదేశాలు ఇచ్చారు. 

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ.. ప్రజలకు , ప్రభుత్వానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తి లేకుండా, లంచాలు లేకుండా పాలన సాగుతోందని అన్నారు.
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైయ‌స్ఆర్ సీపీ అని కొనియాడారు.

కార్యక్ర‌మంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, ఎంపీపీ గొండు రఘురాం, వైస్ ఎంపీపీ బరాటం రామశేషు, త‌హ‌శీల్దార్, ఎంపీడీఓ, ముంజేటి కృష్ణ, గొండు కృష్ణమూర్తి , సర్పంచ్ మార్పు పృధ్వి, మూకళ్ల తాత బాబు, పీస గోపి, కొయ్యాన నాగభూషణ్‌,  మధురెడ్డి, కెప్టెన్ ఎర్రన్న, మండల సర్పంచులు, ఎంపీటీసీ స‌భ్యులు, వివిధ శాఖ‌ల‌కు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

Back to Top