ఎమ్మెల్యే సునీల్‌ ఓటు తొలగింపునకు దరఖాస్తు

ఉద్దేశపూర్వకంగానే ఓట్లు తొలగింపు
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఆగ్రహం
 

చిత్తూరు: పూతలపట్టు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఓటు తొలగింపునకు దరఖాస్తు రావడంతో ఆయన విస్మయ వ్యక్తం చేశారు.  ఉద్దేశపూర్వకంగా వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. మొన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి సోదరుడు,మాజీ ఎంపీ   వైయస్‌ వివేకానందరెడ్డి, నేడు ఎమ్మెల్యే ఓటునే తొలగించేందుకు దరఖాస్తులు చేయడంపై విస్మయం కలిగిస్తోంది.అప్రజాస్వామిక చర్యలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఓట్లను తొలగించేందుకు అధికార టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. 

Back to Top