వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
‘స్థానిక’ ఎన్నికలపై వైయస్ఆర్సీపీ కీలక నిర్ణయం
11 Mar 2020 2:23 PM
అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలపై వైయస్ఆర్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో నిలపవద్దని వైయస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశించింది. ఎవరైనా పోటీలో నిలిపితే వారికి బీఫామ్‌లు ఇవ్వకూడదని రీజినల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, నేటితో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రకియ ముగియనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రేపు నామినేషన్లను పరిశీలించనునాన్నరు. ఈనెల 14న తుది జాబితాను ప్రకటించి, 21న ఎన్నికల నిర్వహించనున్నారు. ఫలితాలను మార్చి 24న ప్రకటించనున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 13 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి.. 27న ఫలితాలను ప్రకటిస్తారు.