బాబూ.. నువ్వు జన్మలో ముఖ్యమంత్రి కాలేవు!

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి 

ప్రజాసేవ చేస్తున్న నేను ‘తోపు’నే..!

నన్ను బెదిరించే సీను నీకు లేదు చంద్రబాబూ..!

నీ బుడ్డ బెదిరింపులకు భయపడే నాకొడుకు లేడు..! 

రూ.2వేల కోట్ల ఆస్తులు నిరూపిస్తే రూ.20 కోట్లకే రాసిస్తా.!

మొన్న 25,600 ఓట్ల మెజార్టీతో గెలిచాం. మళ్లీ 30 వేల ఓట్లతో గెలుస్తా..! 

నువ్వు అధికారంలోకి వస్తే బడా బాబులందరికీ పండుగ... జగనన్న ఉంటే పేదలకు పండగ..!

నీ దోపిడిని బహిర్గతం చేస్తున్న నన్ను బెదిరించేలా మాట్లాడతావా?

చంద్రబాబు వాఖ్యలకు ఘాటుగా స్పందించిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  

నా నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు..!

టిడిపి హయాంలో జరిగిన దోపిడీ, ప్రజలను మోసగించిన వైనాన్ని పవర్‌ పాయింట్‌  ద్వారా ప్రజంటేషన్‌ ఇచ్చిన ఎమ్మెల్యే  

అనంత‌పురం:  చంద్ర‌బాబు ఇక జ‌న్మ‌లో ముఖ్య‌మంత్రి కాలేర‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చ‌రించారు. ప్రాజెక్టుల సందర్శన కోసమంటూ చంద్రబాబు మా సొంత మండలం ఆత్మకూరుకు వచ్చినప్పటి నుంచి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భజన చేసుకుంటూ వచ్చారు. ప్రజాసేవ చేస్తున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ‘తోపే’. అవునోకాదో ప్రజలు నిర్ణయిస్తారు. నేను చేసిన పనులు నిర్ణయిస్తాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా మాట్లాడారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీటైన కౌంటర్‌ ఇచ్చారు. 

శుక్రవారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్‌పి చైర్మన్‌ బోయ గిరిజమ్మతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. నిన్ను అణిచేస్తే...తొక్కేస్తా...దొంగదెబ్బ తీస్తానంటూ చంద్రబాబు మాట్లాడాడు. దొంగదెబ్బ తీయడం తప్పుకాదు తమ్ముళ్లూ దొంగదెబ్బ తీయండని చెబుతున్నాడు. నువ్వు ఫ్యాక్షనిస్టువా...క్రిమినల్‌వా?. మోసగాడు, క్రిమినల్, దోపిడి దారుడు చంద్రాబాబూనే. చంద్రబాబుకు క్యారెక్టర్ ఉంటే కదా అసోసియేషన్ చేసేది. ఆ క్యారెక్టర్ అతనికి లేదు

నా నియోజకవర్గ ప్రజలను నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వారికోసం ఎందాకైనా రెడీనే. నన్ను బెదిరించే స్థాయి నీకు లేదు. నీతాటాకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. పెద్దగా గొంతు చించుకుని అరిస్తే భయపడే వారు లేరు ఇక్కడ. నేను ‘తోపు’నే. ఇక నువ్వు జన్మలో ముఖ్యమంత్రి కాలేవు.

రెండు వేల కోట్లు దోచుకున్నానని నాపై ఆరోపణలు చేశావు. అవి నావి కాదు నాయనా..పరిటాల సునీతవి. ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచేసింది. 100 రూపాయల స్టాంపు పేపరు మీద సంతకం చేసి  ఇస్తా. నేనే కాదు నాభార్య, పిల్లలతో సంతకాలు చేయిస్తా. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న ఆస్తులన్నీ రాయిస్తా. నాకు 50 కోట్లు ఇవ్వు చాలు. లేదా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంపాదించానంటే... కేవలం 20 కోట్లు ఇవ్వు చాలు. స్టాంపు పేపర్‌లో సంతకం పెట్టించి ఇస్తా నువ్వే రాసుకో. ఈనాడు విలేకరో, ఆంధ్రజ్యోతి విలేకరో, టివి–5 విలేకరో వచ్చింటే వారికే ఈ స్టాంపు పేపరు ఇచ్చేస్తా తీసుకోమను. 20 కోట్లు పోను మిగిలిన 1980 కోట్లు తీసుకుని మీకు రాహుల్‌గాంధీ బాగా పరిచయం కదా...పోయి తుంగభద్ర నుంచి సమాంతర కాలువ తీసుకొద్దాం. ఈ 2 వేల కోట్లతో ఆ కాలువలు పూర్తి చేద్దాం. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే మేధావి అనుకుంటున్నావేమో. నువ్వు మేధావి కాదు. 

ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు సిగ్గురాలేదు. నీ హయాంలో ప్రాజెక్టుల పేరుతో 40 వేల కోట్ల రూపాయలు స్కాం చేశారు. నీ కాంట్రాక్టర్లందరూ వేల కోట్ల అధిపతులుగా ఎదిగిపోయారు. నువ్వు అధికారంలోకి వస్తే చాలు బడా బాబులందరికీ పండుగ. జగనన్న ఉంటే పేదలకు పండగ. కార్మికులు, కర్షకులు, బడుగు, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు పండుగ. 

జీడిపల్లి, మాల్యాల రిజర్వాయర్లు నేనే కట్టానని బోగస్‌ మాటలు చెబుతున్నాడు. ఆయనకు ఏమి సంబంధం. 2014లో ఆయన అధికారంలోకి వచ్చేనాటికి నాలుగుసార్లు జీడిపల్లి రిజర్వాయర్‌ను నీటితో నింపారు. రాజశేఖర్‌రెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు తెచ్చిండేది. చంద్రబాబు సిగ్గులేకుండా తప్పుడు కూతలు కూస్తున్నాడు.  కర్నాటక నుంచి నీళ్లు తీసుకొని వస్తానంటున్నావు నువ్వేమైనా పుడింగివా? అంటావు, నువ్వేమైనా పుడింగివా?

పేరూరు డ్యాంకు పైసా ఖర్చు లేకుండా నీళ్లు తీసుకురావచ్చని వందసార్లు చెప్పినా పట్టించుకోలేదు. నీహయాంలో ఏమైనా చెవ్వులో సీసం పోసుకుని ఉంటివా? చంద్రబాబు. నీ హయాంలో నీళ్లు ఇచ్చింటే నీకు, నీమంత్రికి మంచిపేరు వచ్చిండేది. బాధ్యత కల్గిన ప్రతిపక్ష నాయకుడిగా నేను ఫ్రతిపాదనలు చేస్తే పట్టించుకోకుండా నువ్వు చేయాల్సిన దోపిడీని చేసేశావు.హంద్రీ–నివా పేజ్‌–2 పనుల్లో మిగిలిపోయిన 10 కోట్ల పనులను 100 కోట్లకు పెంచేసుకుని దోపిడీ చేశావు. 

నరేంద్రమోడీ కోరియాకు పోయి హుండాయి కంపెనీ సీఈఓతో మాట్లాడి కియా పరిశ్రమ తెస్తే నువ్వు తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటావా?. గొల్లపల్లి రిజర్వాయర్‌ అనేది హంద్రీ–నివా ప్రాజెక్ట్‌లో భాగం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు మొదటిదశ పనులు పూర్తి చేయి రెండోదశ పనులు 70 శాతం పూర్తి చేయించారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు అవసరమైన వెయ్యి ఎకరాల భూమిని సేకరించారు. ఈ రిజర్వాయర్‌ పేరుతో 1400 కోట్లు చంద్రబాబు తిన్నాడు. చంద్రబాబు పెద్ద దొంగ.

2300 రూపాయలు చదరపు అడుగుతో నువ్వు టిడ్కో ఇళ్లు నిర్మిస్తే నేను 800 రూపాయల చదరపు అడుగుతో జగనన్న ఇళ్లు నిర్మిస్తున్నా. నువ్వు కమీషన్ల కోసం దిగిజారావు. పేదలకు సాయం చేసే విషయంలో జగనన్న సేవకుడిగా పని చేయాలనుకున్నా. డబ్బుకు విలువ ఇవ్వం. మా ఇల్లు అమ్ముకునేలా చేసింది నువ్వే చంద్రబాబూ. మా ఆర్థిక మూలలు దెబ్బతీశావు. ఉనికిలో లేకుండా సమూలంగా లేకుండా చేయాలని చూశావు.  చంద్రబాబు నాయుడు పాలనలో ఆయన చుట్టూ బడా వ్యాపారవేత్తలకు కాంట్రాక్టర్లకు అవకాశాలు కల్పించాడు వారందరూ కోట్ల రూపాయలను ఆర్జించి ఈరోజు చార్టెడ్ ఫ్లైట్ లలో తిరుగుతున్నారు.

నువ్వు నక్షలైట్లను చంపించానని చెబుతున్నావ్‌. తీవ్రవాదుల్ని వేరేశామని చెబుతున్నావ్‌. ఆ నక్సలైట్లను పరిటాల రవిని అడ్డు పెట్టుకుని వేరేయించావు. విప్లవకారులు దేశభక్తులని రామారావు అంటే...అదే విప్లవకారులను చంపించావు. నువ్వు చంపించిన సత్యమన్న భార్యకు ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చాం. పేదల పక్షాన పోరాడిన వారికి మేము గౌరవం ఇచ్చాం. నువ్వేమో నిస్సిగ్గుగా విప్లకారులను చంపించానని చెప్పుకుంటున్నావు. పేరూరు జల సాధన సమితి ఏర్పాటు చేసి రైతుల కోసం పోరాడి నీళ్లు సాధించుకున్నాం. రాజశేఖర్‌రెడ్డి గారు హామీ ఇచ్చారు జగనన్న నిలబెట్టుకున్నారు. ఇది మానైజం. ప్రజల కోసం ఎందాకైనా వెళతాం. ఎలాంటి త్యాగాలైనా చేస్తాం.

జాకీ పరిశ్రమ గురించి మాట్లాడుతున్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 145 కోట్ల విలువ చేసే పేద రైతుల భూములు మూడు కోట్లకు ఎలా కొంటావు.  జాకీ పరిశ్రమ ఏర్పాటు కాకుండా ఎల్లగొట్టింది మీరే. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మహిళలతో ఓట్లు వేయించుకుని అసెంబ్లీ నిండుసభలో డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేమని స్వయంగా అప్పటి మంత్రి పరిటాల సునీత చెప్పించారు సిగ్గులేదా?. నువ్వు దోపిడీదారువని ‘కాగ్‌’ నివేదిక ఇచ్చింది.  పనికి 10 లక్షల రూపాయలు బిల్లులు చేసుకున్నారు.

విజయ డెయిరీని చంపిన ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు.. సహకార డెయిరీ వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టిన నేరగాడివి నీవు. నేను సహకార డైరీ మళ్ళీ జీవం పోయడానికి దాతల సహకారంతో ఈరోజు లక్ష లీటర్ల కెపాసిటీ గల అమ్మ డెయిరీ ఏర్పాటు చేశాను.

నీతప్పులు తెలుసుకోకుండా నాగురించి మాట్లాడతావా చంద్రబాబూ?. గోదావరి జలాలు మా రాయలసీమకు వచ్చేలా చూడు దేవుడా అని శ్రీశైలంలో దేవుడికి మొక్కుకున్నా. అది మాకు రైతుల పట్ల ఉన్న ప్రేమ. నీకు మైండు దొబ్బింది. ఎవరైనా రాయిస్తే తప్ప మాట్లాడలేవు. అన్ని వర్గాలను మోసం చేసిన సైకో చంద్రబాబు. నీ బుడ్డ బెదిరింపులకు భయపడే నాకొడుకు లేడు ఇక్కడ. కర్ణాటక నుంచి పట్టకొస్తానని చెబుతున్న చంద్రబాబు హైదరాబాదులో దాక్కున్నాడు . నేనే చంద్రబాబుని పట్టుకొని వస్తా.

ఎనీటైం నేను ఇక్కడే ఉంటాను, ఉండాను కూడా. ప్రజలతో ఉన్నాం. వారితో కలిసి ఉద్యమాలు చేశాం.వేలాదిమంది కార్మికులను పెట్టుకుని పేదల ఇళ్లు నిర్మిస్తున్న నేను ‘తోపే’. మొన్న 25,600 ఓట్ల మెజార్టీతో గెలిచాం. మళ్లీ 30 వేల ఓట్లతో గెలుస్తా. 

భూమా నాగిరెడ్డి భయపడే పార్టీ మారాడు. వెనుక ఉండి హత్యా రాజకీయాలు ప్రోత్సహించడంలో చంద్రబాటు దిట్ట. రామారావు పేరుతో స్కూలు ఏర్పాటు చేసి అందులో బాధితుల పిల్లలను చదివించారు. ఆ పిల్లలు కూడా కొందరు ఖూనీ కేసుల్లో ఇరుక్కున్నారు. చంద్రబాబు విధానాలతో ఎందరో సమిధులయ్యారు ఆయనకు మాత్రం కుర్చీ మిగులుతోంది

రామాయణం, మహాభారతం చూడండి అవసరమైతే దొంగదెబ్బ తీయడం తప్పేమికాదు అని నిన్నటి రోజు చంద్రబాబు అన్నారు. ఇది ఆయన క్రిమినల్‌ మనస్తత్వానికి నిదర్శనం. 

తాజా వీడియోలు

Back to Top