వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పాద‌యాత్ర ఐదేళ్ల పండుగ‌

 వైయస్ జగన్  ప్రజాసంకల్ప యాత్రకు  నేటికి ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైయ‌స్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా  కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వేడుకలకు  మంత్రి జోగి రమేష్, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖరరెడ్డి,పార్టీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి,కాకుమాను రాజశేఖర్, పలువురు పార్టీ నేతలు, కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు.

       ఈ సందర్భంగా రాష్ర్ట మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ..వైయస్ జగన్ చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రని తిరగరాసిందన్నారు.ప్రజాసంకల్పయాత్రతో జగన్ ప్రజలతో మమేకం అయ్యారు.ప్రజాసమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గం చూపారన్నారు.నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఎన్నో అద్భుతమైన పథకాలను జగన్ అమలు చేశారని తెలియచేశారు. వైయస్ జగన్ బటన్ నొక్కి అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందేలా చేస్తున్నారని వివరించారు.ఆయా పధకాల ద్వారా ప్రతి ఇంట్లోనూ సంక్షేమం అందుతోందని తెలిపారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం రాష్ర్టంలో అమలవుతోందని, ప్రతి గ్రామంలోనూ ప్రజల వద్దకే పరిపాలన చేరిందని తెలియచేశారు. 
జనరల్ స్థానాలలో సైతం బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు అవకాశం కల్పించారని తెలిపారు. వైయస్ జగన్ ప్రజల గుండెల్లో ఉన్నందున ఓడించటానికి అన్ని పార్టీలు ఏకమై వస్తున్నాయని అయితే వాటి ఆటలు సాగవని తెలియచేశారు. యుద్దంలోకి రాకముందే చంద్రబాబు అస్త్రసన్యాసం చేశారని ఎద్దేవా చేశారు. ఎల్లోమీడియాలో అడ్డగోలుగా వార్తలు రాయించుకున్నా కూడా శ్రీ వైయస్ జగన్ ను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

       లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ...ప్రజాసంకల్పయాత్ర రాష్ర్ట ప్రజల సమస్యల పరిష్కారానికి ఏ మార్గాన్ని చూపిందన్నారు.శ్రీ వైయస్ జగన్ రాష్ర్టంలోని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర దోహదం చేసిందన్నారు.ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఆ సమస్యలను పరిష్కరించేదిశగా అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టారన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top