సీఎంకు పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్స్ జేఏసీ కృత‌జ్ఞ‌త‌లు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్స్ జేఏసీ ప్ర‌తినిధులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పాలిటెక్నిక్ లెక్చ‌ర‌ర్స్‌ జేఏసీ ప్ర‌తినిధులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏఐసీటీఈ పేస్కేల్స్‌– 2016 ను పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌కు వర్తింపజేస్తూ జీవో నెంబర్ 10ని ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు లెక్చ‌ర‌ర్స్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎంను క‌లిసిన వారిలో పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జేఏసీ కన్వీనర్‌ సి.రాజేంద్రప్రసాద్, కో–కన్వీనర్లు రామ్మోహన్‌ రెడ్డి, సురేంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, బాలమోహన్‌లు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top