విజయనగరం: వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ధీమా వ్యక్తం చేశారు.ఎగ్జిట్‌పోల్స్ కూడా వైయస్‌ఆర్‌సీపీకే అనుకూలంగా వచ్చాయన్నారు.చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం పోయిందని తెలిపారు.2014, 2019 ఎన్నికల మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు.2014లో ప్రజలకు మోస పూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు గద్దెనెక్కారన్నారు.ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.ప్రత్యేకహోదాపై వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పోరాటం చేశారన్నారు. వివిధ సమస్యలపై వైయస్ జగన్ పోరాట పటిమను చూసి ప్రజలందరూ సమర్థవంతుడైన నాయకుడిగా గుర్తించారని తెలిపారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి 14 నెలల పాటు సాగించిన ప్రజా సంక్పలయాత్ర ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిందని తెలిపారు.ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే వైయస్ జగన్ లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు భావించారన్నారు.ఎన్నికల ముందు టీడీపీ పసుపు–కుంకుమ పేరుతో డబ్బు ఇచ్చిన.. మహిళలు ఛీ కొట్టారని తెలిపారు.చంద్రబాబు రాష్ట్రంలో ఓటు అడిగే హక్కును పూర్తిగా కోల్పోయారని తెలిపారు.చంద్రబాబు మాటలను ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు.