సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన నీతి ఆయోగ్‌

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన నీతిఆయోగ్‌

తాడేప‌ల్లి: రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలకు సంబంధించి సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నీతిఆయోగ్ స్వాగతించింది. ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రవేశపెట్టనున్న భారత్ నెట్ ప్రాజెక్టును ప్రశంసించింది. ఈ క్రమంలోనే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన ట్వీట్‌ను నీతిఆయోగ్ రీట్వీట్ చేసింది. భారత్ నెట్ ప్రాజెక్ట్‌ పేరుతో సీఎం వైయ‌స్ జగన్ తీసుకొస్తున్న పథకాన్ని అభినందించింది. 

కాగా.. భారత్ నెట్ ప్రాజెక్ట్ పేరుతో డిజిటల్ పబ్లిక్ లైబ్రరీలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంద‌ని సీఎం వైయ‌స్ జగన్ తన ట్వీట్‌లో తెలిపారు. నిరంతర ఇంటర్నెట్‌ను అందించడం ద్వారా వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ గ్రామస్థాయి నుంచి అమలు చేసేందుకు కృషి చేస్తామని వైయ‌స్ జగన్‌ తెలిపారు.  
 

Back to Top