షుక్రియా.. సీఎం సాబ్‌

వైయ‌స్ఆర్ షాదీ తోఫా ప‌థ‌కంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ముస్లిం నాయ‌కులు
 

అమ‌రావ‌తి: పేదింటి యువతుల వివాహాలను గౌరవంగా జరిపించేందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రవేశపెడుతున్న వైయ‌స్సార్‌ కళ్యాణమస్తు, వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా పథకంపై వైయ‌స్ఆర్‌సీపీ ముస్లిం మైనారిటీ నాయ‌కులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  శుక్ర‌వారం వెల‌గ‌పూడిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో ప‌లువురు ముస్లిం నాయ‌కులు  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి ‘షుక్రియా సీఎం సార్‌.. థ్యాంక్యూ సీఎం సార్‌’ అంటూ ధ‌న్య‌వాదాలు తెలిపారు.  వైయ‌స్ఆర్‌ షాదీ తోఫా పథకాన్ని అక్టోబర్ 1తేదీ నుంచి అమలు చేయనుండడంతో ముస్లింలలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు చెప్పారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన వైయ‌స్ఆర్ షాదీ తోఫా హామీని  అమలు చేయాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. పేదింటి ముస్లిం యువతులు తన చెల్లెళ్లుగా భావించి సాయం చేస్తున్న వైయ‌స్ జగన్ పదికాలాల పాటు వర్థిల్లాలని కోరుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. సీఎంను క‌లిసిన వారిలో ఎమ్మెల్సీ రుహుల్లా, ఆత్మ‌కూరు మున్సిపాలిటీ కో-ఆప్ష‌న్ మెంబ‌ర్ ర‌షీద్‌,  షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజాద్ అలీ, నాయ‌కులు హబీబుల్లా, అమిర్ సాబ్, జబివుల్లా, మౌలానా, మాజీ మున్సిపల్ చైర్మన్ నూర్ మొహమ్మద్,  కౌన్సిలర్ యూనుస్, వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు  ఎస్‌కే యూనుస్, రహమతుల్లా, మౌలానా , వ‌లి ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top