సీఎం వైయ‌స్ జగన్‌పై  దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

నెల్లూరు: విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఈరోజు సీఎం వైయ‌స్ జగన్ గారిపై జరిగిన దాడిని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏనాడూ అభివృద్ధిని నమ్ముకుని రాజకీయాలు చేయలేదు. హింస, కుట్రలు, కుతంత్రాలను మాత్రమే నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నాడని మరోసారి నిరూపణ అయింది అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్ లో పోస్టు చేశారు.

కాగా, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం వైయ‌స్ జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం వైయ‌స్ జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది.  అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం వైయ‌స్ జగన్‌ కనుబొమ్మకు తాకింది. 

Back to Top