తాడేపల్లి: సింపతీ కోసం చంద్రబాబు పడుతున్న పాట్లను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి ఎండగట్టారు. రేపో మాపో తనను అరెస్ట్ చేస్తారంటూ సానుభూతి డ్రామాలాడుతున్నారు చంద్రబాబు గారు. తన భార్యను అవమానించారంటూ గతంలో గుక్కపెట్టారు. ఎన్నికల ముందు తనకు ప్రజలంతా వలయంలా నిలబడి కాపాడుకోవాలని నాటకాలాడినా ఎవరూ పట్టించుకోలేదుగా బాబూ గారూ! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బాగా ముదిరింది.. మొన్నటిదాకా ఆంధ్రాను శ్రీలంకతో పోల్చి శునకానందం పొందారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఆంధ్రా-తెలంగాణను ఉత్తర-దక్షిణ కొరియాలంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సైకియాట్రిస్ట్ కి చూపించుకోండి అన్నా వినకుండా రోడ్లపై తిరుగుతున్న ఈ ఆంధ్రా కిమ్ కు వ్యాధి బాగా ముదిరి పీక్స్ కు వెళ్ళిపోయింది! అంటూ అంతకుముందు విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.