దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ...? 

 వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
 

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఆయన చేతులెత్తేశారంటూ ట్వీట్ చేశారు. 'రెండేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించింది చాలక ఇంత హడావుడి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ లేక పోతే మేం పోటీ చేసేది లేదని ఇప్పటికే చేతులెత్తేశారు. దివాళాకోరు రాజకీయాలెందుకు బాబూ. నీవల్ల కాదు గానీ కుల మేధావి కిరసనాయిలు సలహా ప్రకారం నడుచుకో' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 'యస్‌ బ్యాంకును అడ్డుపెట్టుకొని దోచేశారు'

 ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోంది
'యస్‌ బ్యాంక్‌ పైన చంద్రబాబు అంత ప్రేమ కనబర్చారంటేనే అవతవకలు జరిగినట్టు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ పై దర్యాప్తు జరుగుతోంది. దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోంది' అంటూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్‌ చేశారు.   

Back to Top