చంద్రబాబు టీడీపీని ఓ సర్కస్ ట్రూపులా మార్చాడు

ఎంపీ విజయసాయిరెడ్డి
 

అమరావతి:   చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఓ సర్కస్ ట్రూపుగా మార్చేశారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇందులోభాగంగా చంద్రబాబు ఓ చోట టెంటు వేస్తారనీ, జనం పోగవగానే షో మొదలవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్కస్ కు వచ్చిన వాళ్లంతా తనకు ఓటేసినట్టేనని చంద్రబాబు హుషారై పోతారనీ, కానీ సర్కస్ చూసి చప్పట్లు కొట్టినవారు ఆ తర్వాత అది మర్చిపోతారన్న విషయం చంద్రబాబుకు ఎప్పటికీ అర్థం కాదని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top