తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థకు ప్రశంసల వెల్లువ వస్తుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారుతోందన్నారు. యూకే ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీస్ 2.80 లక్షల మంది వలంటీర్ల అవసరముందని ప్రకటించి అత్యవసర నియామకాలు చేపట్టిందని, ఇంతకంటే ప్రశంస ఏమి కావాలి మన వలంటీర్ వ్యవస్థకు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి ఇలా స్పందించారు. ’పొరుగు రాష్ట్రాలలో వున్న ఏపీ ప్రజలు ఏప్రిల్ 14 వరకు అక్కడే ఉండాలి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ గారితో జగన్ గారు మాట్లాడారు. అక్కడ వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి కేసీఆర్ గారు పెద్ద మనసును చాటుకున్నారు. బయటి నుంచి పౌరులు వస్తే నియంత్రణ చర్యలు గతి తప్పే ప్రమాదం ఉంది’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.