క‌నుమ రైతు గొప్ప‌త‌నాన్ని చాటి చెప్తూనే ఉంటుంది

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి క‌నుమ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఇవాళ ట్వీట్ చేశారు. పంట కోతల తర్వాత వచ్చే కనుమ మన మనసులో, ఇంట్లో, వాకిట్లో అన్నింటా రైతు గొప్పతనాన్ని చాటి చెప్తూనే ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంత‌కుముందు మ‌రో ట్వీట్‌లో.. బీసీలు, దళితులు ఐక్యంగా ఉంటే చంద్రబాబుకు కడుపుమంట. అందుకే వాళ్లలో వారికే చిచ్చుపెడుతున్నాడు. అది పలాస అయినా, వెలగపూడి అయినా , ఈయన విభజించి పాలించు సిద్ధాంతాలు బ్రిటిష్ వారిని మించిపోతున్నాయి. దిగజారుడు రాజకీయాలు చేయడానికిది బ్రిటిష్ వారి కాలం కాదు బాబూ? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top