అసంతృప్తి వైయ‌స్ఆర్‌ సీపీలో కాదు..  చంద్రబాబు,రాధాకృష్ణ మెదళ్లలోనే!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అంటూ ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన త‌ప్పుడు క‌థ‌నాన్ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఖండించారు. అసంతృప్తి వైయ‌స్ఆర్‌సీపీలో కాదు..చంద్ర‌బాబు, ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ మెద‌ళ్ల‌లో ఉంద‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  టీడీపీని జనం చెప్పుతో కొట్టినప్పుడల్లా కరకట్ట అక్రమకొంపలో ఎదో కథనం వండుతారు. దాన్ని 'అంధ'జ్యోతిలో మోస్తారు. అసంతృప్తి వైయ‌స్ఆర్‌ సీపీలో కాదు  చంద్రబాబు,రాధాకృష్ణ మెదళ్లలో ఉంది. కుక్కతోకలాగే వారి బుద్దీ వంకరే. మొన్నటిదాకా ఉద్యోగుల్లో అసంతృప్తన్నారు. ఆత్మకూరు ఫలితం తర్వాత నోరు మూసుకున్నారు అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
 
ఓట్లు వేసిన ప్రజల దగ్గరకు వెళ్లాలన్నా భయపడే బదులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవచ్చుగా. సొంత  నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి కోర్టుకి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్నాడు విగ్గు - పెగ్గు రాజు. మేకపోతు గాంభీర్యంతో ఢిల్లీ పచ్చ మీడియా ముందు  అవాకులు చెవాకులు పేలడం తప్ప ఏమీరాని దద్దమ్మ అంటూ అంత‌కుముందు విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top