తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనని వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అలాగే, విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నాడని విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో కామెంట్ చేశారు. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా.. బాబు వచ్చాడు.. ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయలు కొండెక్కి.. మాంసం ధరలు మండిపోతూ.. పప్పులు నిప్పయ్యాయి. ఒకదాని ధర పెరిగిందని మరోదానితో సర్దుకునే పరిస్థితి లేక ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది. పేద, మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మరోవైపు సామాన్యుడిపై విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నాడు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటి నినాదం కాస్తా.. ఇప్పుడు బాబు వచ్చాడు-భవిష్యత్తు అంధకారం నినాదంగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేశారు.