అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్ష

రియలెస్టేట్‌ వ్యాపారం కోసమే చంద్రబాబు ఆందోళన

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వంగా గీత

తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమవుతుందని, అన్ని ప్రాంతాల అభివృద్ధిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వంగా గీత అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు, రెండు జోన్లు అనే మంచి కాన్సెప్ట్‌ను బోస్టన్‌ కమిటీ తన నివేదిక ద్వారా ఇచ్చిందన్నారు. బీసీజీ కమిటీలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నారని, దాన్ని చంద్రబాబు చులకన చేసి మాట్లాడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అమరావతిలో కొనుగోలు చేసిన భూముల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారన్నారు. తన స్వార్థం కోసం రైతులను, మహిళలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడన్నారు.

అమరావతిలో నేల స్వభావం రీత్యా భవనాల నిర్మాణం ప్రమాదమని, ఈ విషయాన్ని అక్కడి సాధారణ రైతే చెబుతాడన్నారు. రియలెస్టేట్‌ వ్యాపారం కోసం చంద్రబాబు అమరావతిలో రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ అవసరమని, వ్యయభారం లేకుండా రాజధానిని నిర్మించుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కవ అభివృద్ధి జరగాలని, ప్రజలపై ఉన్న ప్రేమతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిని సీఎం వైయస్‌ జగన్‌ ఇష్టంతో చేస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చేసే కార్యక్రమం తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. 

Back to Top