అక్వా రంగ అభివృద్ధికి ఏపీలో అనేక అవకాశాలు  

రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ 

గుంటూరు: అక్వా రంగ అభివృద్ధికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ పేర్కొన్నారు.  శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయంతో పాటు పోటి పడి విదేశీ మారక ద్రవ్యం సాధిస్తున్న రంగం అక్వారంగమన్నారు. మేజర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మోపిదేవి పేర్కొన్నారు. రైతులకు అన్నం పెట్టే సంస్థ నాబార్డు అని పేర్కొన్నారు. పాడి పరిశ్రమకు, అక్వాకల్చర్‌కు సహకారం అందించే సంస్థ నాబార్డు అన్నారు. అంతటి ప్రతిష్టాత్మక మైన బ్యాంక్‌కు ఈ గ్రామ వాసి గోవిందరాజులు చైర్మన్ కావటం సంతోషమని పేర్కొన్నారు. రైతులు, మహిళల అభివృద్ధికి సీఎం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎంపీ తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top