కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి అనుమతించాలి

కేంద్ర మంత్రికి వైయస్ఆర్‌సీపీ ఎంపీల వినతి 
 

న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, రెడ్డప్ప, రంగయ్య కలిశారు. కృష్ణాపురం ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతించాలని ఎంపీలు మంత్రిని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి పీయూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పీయూష్‌ గోయల్‌ను కలిసినట్లు ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. కృష్ణాపురం ఉల్లి రైతుల సమస్యను మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. ఉల్లి ఎగుమతి కోసం సీఎం వైయస్‌ జగన్‌ లేఖ కూడా రాశారని చెప్పారు. మా వినతిపై పీయూష్‌ గోయల్‌ సానుకూలంగా స్పందించారని మిథున్‌రెడ్డి తెలిపారు.  త్వరలోనే ఉల్లి ఎగుమతికి అనుమతి వస్తుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top