దిశ యాప్ కొన‌సాగిస్తారా..లేదా?

మండ‌లిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి 

అమ‌రావ‌తి:  ఆడ‌బిడ్డ‌ల భ‌ద్ర‌త కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన దిశ యాప్‌ను కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగిస్తుందా?  లేదా అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు కళ్యాణి ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం శాస‌న మండ‌లిలో దిశ యాప్‌పై ఆమె మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాల‌ని వ‌రుదు క‌ళ్యాణి కోరారు. పనిచేసే చోట మహిళలు అనేక వేధింపులకు గురవుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దిశ యాప్ ఉంటే మ‌హిళ‌ల‌కు ఎంతో ఉపయోగంగా ఉంటుంద‌ని చెప్పారు. దిశ యాప్ ను కొనసాగిస్తారా?  లేక మరొక యాప్  తీసుకొస్తారా సమాధానం చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు.
 

Back to Top