వాలంటీర్ల కుటుంబాలకు అండ‌

ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి  

అనంత‌పురం: వాలంటీర్ల కుటుంబాలకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అండగా నిలిచారు. రామగిరి మండల కేంద్రంలో వాలంటర్ గా పనిచేస్తున్న రాజేష్ వ్యక్తిగత కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రామగిరికి వెళ్లి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజేష్ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. మరో వాలంటీర్ శశికళ భర్త ఇటీవల మృతి చెందారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే  లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. రామగిరికి చెందిన రజని అనే మహిళ భర్త మృతి చెందాడు. ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యులను పరామర్శించి బాధిత కుటుంబానికి  50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. 

 రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్త పవన్ తల్లి ఓబులమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామానికి వెళ్లి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఓబులమ్మ భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మీకు తోపుదుర్తి కుటుంబం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి ఎంపీటీసీ సభ్యుడు జూటూరు పెన్నోబులేసు కుమారుడు గోవిందు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని ఎమ్మెల్యే గారు పరిశీలించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

రామగిరిలోని పెద్దమ్మ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 50 వేల రూపాయలు విరాళం అందజేశారు..


 

తాజా వీడియోలు

Back to Top