తాడేపల్లి: అసాంఘిక శక్తులకు గాడ్‌ఫాదర్ చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. అ సలు జనం నిద్రపోయే టైమ్‌లో యాత్రలో ఏంటో అర్థం కావడం లేదన్నారు. ముఖం మీద ఎండపడకుండా చేసే యాత్ర ఒక యాత్రేనా అని మండిపడ్డారు సుధాకర్‌బాబు. పనికిమాలిన వాడిని రోడ్డుమీద తిప్పి సొల్లుకబుర్లు ఎందుకు చెప్పిస్తున్నారని ప్రశ్నించారు. విటమిన్లు లోపిస్లే ట్యాబ్లెట్లు వాడొచ్చని, మరి సిగ్గు లేని వాడికి ఏం మందలు వాడాలి? అని అడిగారు. ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఏం మాట్లాడారంటే..: దమ్ముంటే వాటిపై స్పందించాలి: చంద్రబాబూ.. నీకూ, నీ కొడుక్కు ఏ మాత్రం సిగ్గూ లజ్జ ఉన్నా.. దమ్ముంటే ఐటీ శాఖ నోటీసులపై స్పందించాలి. ఇదే నా సవాల్. అమరావతి రాజధాని నిర్మాణాల పేరిట రూ.118 కోట్లు చేతులు మారి చంద్రబాబుకు చేరాయని ఐటీ శాఖ నీకు నోటీసులిస్తే మీ నోరెందుకు మూగ బోయింది..? తండ్రీకొడుకులు వేర్వేరుగా రోడ్ల మీద పడి తిరుగుతూ అవాకులు చెవాకులు పేలుతున్నారు. కానీ, ఐటీ శాఖ నోటీసులపై మాత్రం నోరు మెదపడం లేదు. తేలు కుట్టిన దొంగల్లా ఎందుకు ఉన్నారు?. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రా.. ఎక్కడున్నావ్..?: చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులపై దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌కు తెలియదా..? జాతీయ మీడియా సైతం హోరెత్తే కథనాలతో చంద్రబాబు, లోకేశ్‌ను ప్రశ్నిస్తుంటే.. రాజకీయాల్లో ప్రశ్నించడానికే వచ్చానని చెప్పుకునే దత్తపుత్రుడు ఎక్కడ నిద్ర పోతున్నాడు..?. కనీసం, నువ్వైనా నీ దత్తతండ్రికి ఐటీశాఖ నోటీసులపై స్పందించమని చెప్పాలి. అదే విధంగా మరిదికి ఐటీ నోటీసులిస్తే బీజేపీ అధ్యక్షురాలైన వదిన పురందేశ్వరి ఎందుకు మౌనంగా ఉన్నారు..? చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిన సీపీఐ నాయకులెవరూ దీనిపై మాట్లాడటం లేదేంటి..? అటు కాంగ్రెస్ కూడా గమ్మున కూర్చొంది. రాష్ట్ర ప్రజలు, ఈ డ్రామాలను అర్ధం చేసుకోవాలి. తెలుగు మాఫియా ముఠాగా టీడీపీ: చంద్రబాబు రాజకీయ విపరీత ధోరణులను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ కాస్తా తెలుగు మాఫియా ముఠాగా మారింది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, దాడులు చేసి ప్రజల ధన మాన ప్రాణాల్ని దోచుకోవడం ఈ మాఫియా ముఠా పనిగా మారింది. కనీసం, ఒక బస్సైనా తగులబెట్టకపోతే అది బంద్ ఎలా అవుతుందని చంద్రబాబు అన్నట్లు స్వయానా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో రాశారు. నారా అంటే నరరూప రాక్షసత్వమనే ఇంటిపేరు పెట్టుకున్న బాబు, ఆయన కొడుకు లోకేశ్ కలిసి ఈ రాష్ట్రంలో అశాంతిని రగిల్చేందుకు ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేస్తున్నారు. వారి ముఠాల్ని నియోజకవర్గాల వారీగా ఉసి గొల్పి కులాల నడుమ గొడవలు సృష్టించి శాంతిభద్రతల సమస్యల్ని లేవనెత్తడమే పనిగా పథక రచన చేస్తున్నారు. మాఫియా డాన్‌గా చంద్రబాబు: గొడవలు సృష్టించే అలవాటు చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచే ఉంది. యూనివర్సిటీలో యూనియన్లు నడిపే క్రమంలో ఆయన ఏ విధంగా రాజకీయం చేసేవాడో చంద్రబాబే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మాఫియా సంస్కృతిని పూర్తిగా వంట బట్టించుకుని.. తనకు లేని నాయకత్వాన్ని ప్రజల మీద రుద్దుతూ.. వారిని ఏదో ఒక విధంగా పరిపాలించాలనే రాజకీయ ప్రయాణం ఆయన 40 ఏళ్లుగా చేస్తున్నారు. ఒక మాఫియా డాన్ అవతారమెత్తిన చంద్రబాబు ఎన్నో హత్యలు చేయించాడు. తన రాజకీయానికి అడ్డొచ్చిన వారిని దారుణాతి దారుణంగా చంపించాడు. బాబు హత్యాకాండ చూస్తే..: చంద్రబాబు చేయించిన హత్యాకాండలో బాగా సంచలనమైన కేసులు చూస్తే.. వంగవీటి మోహనరంగాను విజయవాడ నడిబొడ్డున గూండాలతో నరికి చంపించాడు. మల్లెల బాబ్జీ అనే అతను ఎన్టీఆర్‌ను పొడిచాడనే డ్రామాను క్రియేట్ చేసి.. ఆ తర్వాత ఈ డ్రామా అంతా చంద్రబాబే నడిపించాడని ప్రజలకు తెలియడంతో బాబ్జీని కూడా చంపించాడు. విజయవాడలోనే పింగళి దశరథ్‌రామ్‌ను చంపించాడు. అదే విధంగా రాష్ట్ర విభజన తర్వాత పత్తికొండ వైఎస్‌ఆర్‌సీపీ ఇంచార్జి నారాయణరెడ్డిని కూడా దారుణంగా చంపించాడు. కుంపట్లు రాజేయడంలో దిట్ట: చంద్రబాబు పరిపాలనలో లోపాల్ని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక అలజడి సృష్టించి వారి దృష్టి మరల్చడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. అందులో భాగంగానే తన అసమర్ధత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తునిలో రైలు తగల బెట్టించాడు. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాడు. కాపులు, బీసీలకు గొడవలు పెట్టాలని చూశాడు. దళితుల మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నించాడు. భారత రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి నయవంచకుడు మరొకడు ఉండడు. అసాంఘిక శక్తులకు గాడ్‌ఫాదర్..: విద్యుత్ ఛార్జీలను అడ్డగోలుగా పెంచారని ఆగ్రహించి ప్రజలు, రైతులు తిరగబడితే.. బషీర్‌బాగ్‌లో వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించి, ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు. జీతాల కోసం అంగన్‌వాడీలు రోడ్డెక్కితే, వారిని గుర్రాలతో తొక్కించిన రాక్షసుడు చంద్రబాబు. సమాజంలో సంఘవిద్రోహ శక్తిగా ప్రజల ధన,మాన, ప్రాణాల్ని దోచుకునేందుకు ఎంతకైనా తెగించే విలన్‌కు ఉండే లక్షణాలన్నీ చంద్రబాబు పుణికిపుచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. విలన్ ఎదుగులలో ఒక సంస్కృతి, సంప్రదాయం అంటూ ఏమీ ఉండదు. చీకటి సామ్రాజ్యాన్ని ఏలేందుకు హత్యా రాజకీయాల్ని నడుపుతూ భవిష్యత్తుకు బాట వేసుకుంటూ ముందుకు పోతారు. సరిగ్గా చంద్రబాబు కూడా అంతే. దోపిడీ ముఠా, హత్యలు చేసే నేరస్తులకు డాన్‌గా ఎదిగి.. ఈరోజు తెలుగు మాఫియా ముఠాకు నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. అసాంఘిక శక్తులకు గాడ్‌ఫాదర్‌గా మారి ఆశ్రయం కల్పిస్తున్నాడు. రాజకీయ నాయకత్వంలో లోకేశ్ ఫెయిల్: కన్నకొడుకు లోకేశ్‌కు రాజకీయ చైతన్యం లేదని.. తన కొడుక్కి రాజకీయాలపై ఏ మాత్రం పట్టు లేదని.. కౌన్సిలర్‌గా కూడా గెలవలేని తనను మంగళగిరిలో పోటీ చేయిస్తే ఓడిపోయాడనే బాధ, నైరాశ్యం చంద్రబాబులో ఉంది. దాంతో ఆయన రాష్ట్ర ప్రజలపై దాడులు చేయిస్తున్నాడు. ‘నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ కొడుకు మంగళగిరిలోనే గెలవనప్పుడు.. మళ్లీ ఆ లోకేశ్‌ను ఎందుకు రోడ్ల మీదకి పంపావు..? ఆయన్ను పెద్ద నాయకుడిగా టీడీపీ నేతల మీదికి, ప్రజల మీదికి ఎందుకు రుద్దే ప్రయత్నం చేస్తున్నావు..?’ అని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. లోకేశ్ పాదయాత్ర ప్రజాదరణ పొందడంల లేదు. ఏదో అర్ధరాత్రినో.. లేదంటే, సూర్యుడు అస్తమించిన తర్వాత, ప్రజలంతా నిద్ర పోయేటప్పుడు.. పాదయాత్ర చేస్తున్నాడు. తెలుగు భాష రాని లోకేశ్ సొల్లుకబుర్లతో అర్ధం కాని మాటలతో ప్రజలు నవ్వుకునేలా ప్రసంగిస్తుంటే.. ఎన్టీఆర్ మనవడు ఇలా మాట్లాడతాడేంటని ప్రజలు ముఖం చిట్లించుకుంటున్నారు. అయితే, లోకేశ్ యాత్రలో ఎవరైనా ముందుకొచ్చి మాకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారా?. అని సవాల్ చేస్తున్నాను. ఆ లోపంతో వెర్రెక్కిపోతున్న తండ్రీ కొడుకులు: ఎవరికైనా విటమిన్‌లు లోపిస్తే వైద్యులు కొన్ని మందులు వాడమని సలహా ఇస్తారు. మరి, చంద్రబాబు, లోకేశ్ సిగ్గూ లజ్జ లోపంతో వెర్రెక్కి పోతున్నారు. సిగ్గూ లజ్జ కోల్పోయిన వారికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా..? ఇందుకు వైద్యులెవరైనా మందులు ప్రిస్కైబ్ చేస్తే బాగుంటుందేమో.. అని మనవి చేస్తున్నాను. వాళ్ల డ్యూటీ ఏమిటి?: మీరు పాదయాత్ర చేస్తుంటే వైఎస్‌ఆర్‌సీపీ పని గట్టుకుని రాళ్లుతో దాడి చేస్తో్తందా..? ఆ మాట అనడానికి టీడీపీ నేతలకు సిగ్గుందా..? ఈ చేతగాని చవట దద్దమ్మ రోడ్డుమీదకొస్తే.. ఆయన చుట్టూ రెడ్ టీషర్టు వేసుకున్న 500 మంది కుర్రాళ్లు ఎవరు..? ఎందుకు వాళ్లను అదేపనిగా వెంటబెట్టుకుని తిప్పుతున్నారు..? వాళ్లు చేసే డ్యూటీ ఏంటి.? మరి, వాళ్ల దగ్గర రాళ్లు, కర్రలు ఎందుకు ఉన్నాయి..? తుపాకులు ఎందుకున్నాయి..? ఇందుకు కారణమేంటి.? చంద్రబాబు వీటిపై సమాధానం చెప్పాలి. తిరుగుబాటును ఎదుర్కోవడానికా?: ప్రజాస్వామ్యంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కొడుకు పాదయాత్ర చేస్తుంటే.. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని ముందుగానే ఊహించి మీరు ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టుకున్నారా..? ఎంతో ప్రశాంతంగా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో మీ ప్రొటెక్షన్‌ఫోర్స్ రోడ్లపైన రౌడీయిజం చేస్తారా..? మీ దత్తపుత్రుడు ఓడిపోయిన భీమవరానికి నీ సొంత పుత్రుడ్ని పంపి అక్కడ అలజడులు సృష్టించి దత్తపుత్రుని కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటున్నావా చంద్రబాబూ?. లోకేశ్ పాదయాత్రలో అలజడులకు చంద్రబాబు కుట్రే కారణం. మా ఎమ్మెల్యేకు ఏం అవసరం?: భీమవరంలో పవన్‌కళ్యాణ్‌పై వైఎస్‌ఆర్‌సీపీ నుంచి శ్రీ గ్రంథి శ్రీనివాస్ గెలిచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన ఒక చవట దద్దమ్మ రోడ్లమీద తిరిగితే దాడులు చేయించడానికి మా ఎమ్మెల్యేకి ఏం అవసరం?. లోకేశ్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఒక హైప్ క్రియేట్ చేసుకునేందుకు చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈ అలజడులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు.