అమరావతి స్కామ్‌పై విచారణ జరపాలి

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
 

అమరావతి: అమరావతి పేరుతో చంద్రబాబు స్కామ్‌కు పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డిమాండు చేశారు.   అమరావతి పేరుతో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. తాము చెప్పినట్టే చంద్రబాబు అవినీతి బయటపడుతుందని గుర్తుచేశారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐ, ఈడీలతో లోతైన విచారణ జరిపించాలని కోరారు.   నిప్పు అని చెప్పుకునే బాబు.. ఇప్పుడేం చేస్తారని ఎద్దేవా చేశారు. ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బాబుకు ఐదేళ్లు టైమిస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై సీబీఐ, ఈడీ కూడా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని శ్రీదేవి డిమాండ్‌ చేశారు.

 

తాజా వీడియోలు

Back to Top