సీఎం వైయస్‌ జగన్‌ మానవత్వం ఉన్న నాయకుడు

ఎమ్మెల్యే రోజా

చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వం ఉన్న నాయకుడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశంసించారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైయస్‌ఆర్‌ కంటివెలుగు’ కార్యక్రమాన్ని ఆమె గురువారం చిత్తూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా  మీడియాతో మాట్లాడుతూ.. ‘వైయస్‌ఆర్‌  కంటివెలుగు’ కార్యక్రమం పేద ప్రజలకు మరో సంజీవని వంటిదని కొనియాడారు. దివంగత సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి ‘ఆరోగ్య శ్రీ’ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారు.. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకువేసి ‘వైయస్‌ఆర్‌  కంటివెలగు’ను ప్రారంభించారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ కంటి సంబంధిత జబ్బులు లేకుండా చూడాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమని.. ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని రోజా పేర్కొన్నారు. 
 

Back to Top