ఈ ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే 

ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
 

అమరావతి:  విజయనగరం జిల్లాకు ఇంతవరకు రాజ్యాంగబద్ధమైన పదవులు రాలేదని,  కొలగొట్ల వీరభద్రస్వామిని డిప్యూటీ స్పీకర్‌గా కూర్చోబెట్టిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామి ఎన్నికైన సందర్భంగా సభలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు డిప్యూటీ స్పీకర్‌గా మీకు అవకాశం రావడం సంతోషంగా ఉంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మీకు ఈ గౌరవాన్ని కల్పించిందనందుకు సీఎం వైయస్‌ జగన్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాసన సభలో సభాపతి స్థానం అంటే తండ్రి స్థానంగా భావిస్తాం. ఈ రోజు అలాంటి తండ్రిస్థానంలో తండ్రి సమానులైన మీరు కూర్చునందుకు వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా మీకు ఉన్నతమైన స్థానం రావాలని, మిమ్మల్ని అభిమానించే  మాలాంటి వారు.. మన ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలు, కార్యకర్తలు కోరుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని మన సీఎం వైయస్‌ జగన్‌ మీకు కల్పించారు. అందుకు మా ప్రజలు, కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మీకు దక్కిన ఈ అవకాశం చాలా ప్రత్యేకమైంది. మన జిల్లా చరిత్రలోనే ఇప్పటి వరకు రాజ్యాంగబద్ధమైన స్థానంలో కూర్చునే అవకాశం రాలేదు. ఇప్పటి వరకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా మన జిల్లాకు చెందిన వారు ఎవరు పని చేయలేదు. ఈ రోజు ఆ రికార్డును మీరు సృష్టించారు. మీరు ఏం చేసినా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజు ఈ పదవిని మొట్ట మొదటిసారిగా అలంకరించి మీరు రుజువు చేసుకున్నారు. మీరు నాకు తండ్రి సమానులు, నన్ను గాని, రాజు గారిని గాని రాజకీయంగా ప్రోత్సహించారు. ఇలాంటి మీకు ఉన్నత స్థానం దక్కడం చాలా సంతోషంగా ఉంది.

మన జిల్లాలో మిమ్మల్ని స్వామన్న..స్వామన్న అని పిలుసుకుంటారు. పసిపిల్లాడైనా, పెద్దవాడైనా మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుంటారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని సొంత మనిషిగా భావిస్తారు. ఇన్నాళ్లు మిమ్మల్ని అన్నా అని పిలిచిన వారు..ఇవాళ్టీ నుంచి అధ్యక్ష అని పిలుస్తారు. ఈ ఘనత వైయస్‌ జగన్‌ కే దక్కుతుంది. మన ఉత్తరాంధ్ర ప్రాంతమంటే సీఎం వైయస్‌ జగన్‌కు ప్రత్యేక అభిమానం ఉంది. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం గారిని, డిప్యూటీ స్పీకర్‌గా మీకు అవకాశం కల్పించి మరోసారి మన ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల సీఎం వైయస్‌ జగన్‌ తన అభిమానాన్ని చాటుకున్నారు. మీరు మొదటి నుంచి సీఎం వైయస్‌ జగన్‌ వెంట నడిచిన వ్యక్తి. ఆయన అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా ఆయనతోనే ప్రయాణం చేశారు. 2014కు ముందు వైయస్‌ జగన్‌ వెంట నడిచి మీ విధేయతను చాటుకున్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు కూడా మీ పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపారు. మీరు వైయస్‌ జగనన్న వెంట నడిచారో..అంతే విలువను జగనన్న మీకు ఇచ్చారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి వైయస్‌ జగన్‌ మీకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మీకు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడం వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కచ్చితంగా మీరు విజయవంతం అవుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. మీరు మాస్‌ లీడర్‌. సభను సజావుగా నడుపుతారు. ప్రజల్లో నిరంతరం ఉన్న వ్యక్తిగా మీరు సభను విజయవంతంగా నడిపించగలరు. ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తు వేయగలరు. ఈ సభను ప్రజాగొంతుకగా నడిపించగలరు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎక్కడా రాజీ పడని వ్యక్తి కాబట్టి..ఈ సభలో కూడా అలాగే పని చేస్తారని విశ్వసిస్తున్నాను. రాజీ పడకుండా నడిపిస్తారని, ఈ సభను ఉన్నత విలువలతో నడిపిస్తారని నమ్ముతున్నాను. ఉప సభాపతి స్థానానికి చిన్న మచ్చ కూడా తీసుకురాకుండా సభను నడిపిస్తారని, సభ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తారన్న విశ్వాసం మాకు ఉంది. మీ నియోజకవర్గం ప్రజలకు అన్నా..మా జిల్లా ప్రజల మాస్‌ లీడర్‌..వైయస్‌ రాజశేఖరరెడ్డి గారి విధేయుడు, వైయస్‌ జగనన్నకు నమ్మినబంటు అయిన మీరు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టినందుకు మనస్పూర్తిగా మరోసారి అభినందనలు తెలియజేస్తున్నానంటూ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి సెలవు తీసుకున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top