అయ్యన్న పాత్రుడి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం..

ఎమ్మెల్యే మల్లాది విష్ణు  

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు పేర్కొన్నారు. చంద్రబాబు, టిడిపి నేతలు రాష్ట్రంలో రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న‌ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై దాడి చేయడం చాలా బాధాకర‌మ‌న్నారు. చంద్రబాబు, టిడిపి నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. విజ‌య‌వాడ‌లో మ‌ల్లాదివిష్ణు మీడియాతో మాట్లాడుతూ..శాంతియుతంగా నిరసన చేస్తుంటే టీడీపీ నాయకులు దాడులు చేయడం హేయమ‌న్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబు, టిడిపి నేతలు మారార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు కావాలనే వైయ‌స్ఆర్‌ సీపీ నాయకుల పై దాడి చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. ప్రధానమైన ప్రతిపక్షంగా టిడిపి వ్యవహరించలేదు. బడుగు బలహీన వర్గంఎమ్మెల్యే పై దాడి చేయడం దుర్మార్గ‌మ‌న్నారు. రాష్ట్రంలో కుట్రలు అన్నిటికీ చంద్రబాబే కారణం..టిడిపి అధికారంలో లేకుంటే ఇన్ని దాడులు చేస్తోందా అని నిల‌దీశారు. బుద్ధ వెంకన్న, అయ్యన్నపాత్రుడు చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాల‌ని మ‌ల్లాది విష్ణు డిమాండు చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top