సొల్లు మానుకోక‌పోతే ఈ సారి టీడీపీకి 23 సీట్లు కూడా మిగ‌ల‌వు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్  

డ్రామా ఆర్టిస్టు దేవినేని ఉమ నిన్నటి నుంచి కొత్త డ్రామాకు తెర‌

గ‌నులు, ఇసుక‌, మ‌ట్టి , బూడిద వ‌ర‌కు మొత్తం దోచుకుతిన్న‌ది ఉమానే

ఎస్సీ, ఎస్టీలు, బీసీల‌ను తిడితే ఊరుకుంటారా?

తాడేప‌ల్లి:  టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ నేత‌లు సొల్లు మాట‌లు మాట్లాడ‌టం మానుకోక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి 23 ఎమ్మెల్యే సీట్లు కూడా మిగ‌ల‌వ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్  పేర్కొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా తీరుపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడారు.

 డ్రామా ఆర్టిస్టు దేవినేని సొల్లు ఉమ నిన్నటి నుంచి కొత్త డ్రామాకు తెర‌దీశాడు. సొల్లు ఉమ ప్ర‌తిరోజూ వీధి కుక్క మొరిగిన‌ట్లు మొరుగుతాడు.  రాష్ట్రంలో చంద్ర‌బాబు ఒక‌ప‌క్క ప్రభుత్వంపై జూమ్ ల్లో బురదజల్లుతుంటే.. కృష్ణా జిల్లాలో సొల్లు ఉమ రోజూ ఎక్కడో ఒకచోట మొరుగుతుంటాడు. చంద్ర‌బాబు, దేవినేని ఉమా సొల్లు మాట‌లు చెబుతార‌నేది న‌గ్న స‌త్యం.  వీళ్ల సొల్లు మాట‌లు విని విర‌క్తి చెందే.. రాష్ట్ర‌ ప్ర‌జ‌లు 23 సీట్ల‌కు టీడీపీని ప‌రిమితం చేశారు. ఈ సారి ఆ 23 కూడా మిగ‌ల‌వు.  ఇదే విధంగా చంద్ర‌బాబు అండో కో ప్ర‌వ‌ర్తిస్తే, గ్రామాల నుండే కాదు..  రాష్ట్రం నుంచి త‌రిమిత‌రిమి కొట్ట‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు. 

 అక్ర‌మ మైనింగ్ అంటూ..  రెండు సంవ‌త్స‌రాల నుంచి దేవినేని ఉమా సొల్లు మాట‌లు మాట్లాడుతూనే ఉన్నాడు.  మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో గ‌నులు, ఇసుక‌, మ‌ట్టి ద‌గ్గ‌ర నుంచి ఆఖ‌రికి బూడిద వ‌ర‌కు మొత్తం దోచుకుతిన్న‌ది దేవినేని ఉమానే.  దోచుకుతిన్నాడు కాబ‌ట్టే.. ఈరోజు దేవినేని ఉమా నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెడుతుంటే ప్ర‌జ‌లు ఛీద‌రించుకుని వెంట‌బ‌డుతున్నారు, మా గ్రామాల్లోకి రావ‌ద్దంటున్నారు..

 కొన్ని పెయిడ్ మీడియా ఛానెల్స్ ను పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఉమాపై దాడి జరిగితే ద‌ర్జాగా కారులో కూర్చొని ఇంట‌ర్య్వూలు ఇస్తారా?.  కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టుకుని, కారులో ద‌ర్జాగా కూర్చొని, నాపై దాడి జ‌రిగింద‌ని పోలీస్ స్టేష‌న్ కు ఉమా వెళ్లాడు

  దేవినేని ఉమా, ఆయన అనుచరులు ఎస్సీ, ఎస్టీలు, బీసీల‌ను తిడితే ఊరుకుంటారా?.  అసలు అక్రమ క్వారీయింగ్ జ‌ర‌గ‌టంలేద‌ని గ్రామ‌స్తులు చెబుతుంటే.. ఎస్సీ, ఎస్టీ,  బీస్సీల మీద దాడులు చేస్తారా..? 

 దళితుల మీద నోరు పారేసుకుని, దాడి చేసినందుకు దేవినేని ఉమాకి త‌గిన‌శాస్తి చేయాల్సిందే.. మంత్రిగా ఉన్న‌ప్పుడు పోల‌వ‌రం మ‌ట్టి దోచుకున్నాడు, కొండ‌ప‌ల్లి రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో గ్రావెల్ తవ్వించిందీ, అమ్ముకున్నది కూడా దేవినేని, టీడీపీ నేతలు కాదా? ఇసుక దోచుకుంది మీరు కాదా? - అధికారంలో ఉన్న ఐదేళ్ళపాటు  దోచుకుని.. దాచుకుని.. మ‌ళ్లీ మా ప్ర‌భుత్వంపై నింద‌లు వేస్తారా.. ? 

 మాది స్వ‌చ్ఛ‌మైన, పారదర్శకమైమ ప్ర‌భుత్వం.. మా ముఖ్య‌మంత్రిగారు మా పార్టీ వారు తప్పు చేసినా, మా శాస‌న‌స‌భ్యులు త‌ప్పు చేసినా, ఎవ‌రు త‌ప్పు చేసినా వ‌దిలిపెట్ట‌రు.. ఎవ‌ర్నీ క్ష‌మించ‌రు..

 కొండవీడు ప్రాంతంలో అక్ర‌మ మైనింగ్ జ‌ర‌గ‌లేదు.. పేద‌ల ఇళ్ల‌ కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌ ఇళ్ల స్థ‌లాలు మెర‌క చేయ‌డం కోసం ప్ర‌భుత్వ అనుమ‌తి ఇస్తే, దానిని ఎమ్మెల్యే వ‌సంత‌ కృష్ణ‌ప్ర‌సాద్ గారికి  అంట‌క‌డ‌తావా, వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వానికి అంట‌క‌డ‌తావా ఉమా..?. ఇళ్ల స్థ‌లాల మెరక కోసం తెచ్చుకుంటున్నామ‌ని ప్ర‌జ‌లు చెబుతుంటే, ప్ర‌జ‌లు అడ్డ‌గిస్తే.. వారిపై దౌర్జ‌న్యం చేస్తే ఊరుకుంటారా? 

 దేవినేని ఉమా.. బుద్దిలేకుండా, వీధి కుక్క‌లా మాట్లాడుతున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌ను తిడితే కేసులు పెట్ట‌రా? అరెస్టులు చేయ‌రా?. మా బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లు అంటే చిన్న‌చూపా? చుల‌క‌నా? మా వ‌ర్గాల మీద దాడి చేస్తే ఊరుకుంటామా? ఎందుకు అరెస్టు చెయ్యరు?

 దేవినేని ఉమ ఆయ‌న‌ గుండాల అరాచకాలను చూస్తూ ఊరుకోం.. దేవినేని ఉమాని అసలు ఎవ‌రు కొట్టారు? ఉమా ఆధ్వ‌ర్యంలో ఆయ‌న‌ వెంట వ‌చ్చిన గుండాలు దాడి చేశారు. దేవినేని ఉమ‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద చేసు న‌మోదు చేసి, శిక్ష విధించాలి. చంద్ర‌బాబు అండ్ కో చౌక‌బారు డ్రామ‌లు ఇప్ప‌టికైనా క‌ట్టిపెట్టాలి.  

 మ‌న‌సున్న ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో పార్టీ, కులం, మ‌తం, ప్రాంతం చూడ‌కుండా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌రికీ అందుతుంటే.. చూసి ఓర్వ‌లేక‌ ఇంత ఉక్రోశం, కుళ్లు ఎందుకు?
 బ‌ల‌హీన‌వ‌ర్గాల మీద దాడి చేస్తాం అంటే త‌రమిత‌రిమి కొడ‌తారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా మా బ‌ల‌హీన‌ వ‌ర్గాల జోలికి వ‌స్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. 
 వైయ‌స్ఆర్ సీపీ ధాటికి,  గౌర‌వ ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జ‌గ‌న్ గారి మీద ప్ర‌జ‌ల‌కు ఉన్న అభిమానానికి రాష్ట్ర ఎల్లలు దాటి నారా చంద్ర‌బాబు అండ్ కో పారిపోతారు.. రాసిపెట్టుకోండి..అంటూ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేర్కొన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top