ఉన్మాది ఎవరో తేలాలి? 

ఎమ్మెల్యే జోగి రమేష్‌
 

అసెంబ్లీ: ఉన్మాది అన్నది ఎవరో ఈ సభలో తేలాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌ డిమాండు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎంను ఉద్దేశించి అన్న ఉన్మాది అనడం దుర్మార్గం. మనస్సున్న వైయస్‌ జగన్‌ను ఈ మాట అంటారా? ఎన్టీరామారావును మానసిక క్షోభకు గురి చేసిన చంద్రబాబును అంటారా తేలాలి. ఈ రోజు మార్షల్స్‌ను టీడీపీ నేతలు బెదిరించారు. ఫోటోలు తీసి అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తారా? ఉన్మాది అన్న మాట మాట్లాడటం తప్పే. చంద్రబాబు ఈ సభలో క్షమాపణ చెప్పాల్సిందే. ఉన్మాది అనే మాటను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి. 

Back to Top