ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారు

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌
 

 అసెంబ్లీ: ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని, మా ప్రాంతంపై విషయం కక్కుతున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరు సభలో దారుణంగా ఉంది. దేవాలయం వంటి సభలో టీడీపీ సభ్యులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. బూతులు తిడుతున్నారు. టీడీపీ సభ్యుల తిట్లు భరించలేకుండా ఉన్నాం. ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య గోడ కడితే బాగుంటుంది. రాష్ట్ర ప్రజలకు 151 సీట్లు ఇచ్చి ఇక్కడ కూర్చునే అవకాశం ఇచ్చారు. ఎత్తు,  బరువును చూసి లోకేష్‌, అచ్చెన్నాయుడిని అక్కడ కూర్చోబెట్టారు. 
 

Back to Top