రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడమే చంద్రబాబు లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీ‌నివాస్‌

పుంగనూరులో చేసిన అరాచకాన్నే భీమవరంలో చేశారు

 ఐటీ నోటీసుల అంశాన్ని దృష్టి మరల్చేందుకే బాబు అరాచకం 

నాపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించే దమ్ముందా?

లోకేష్‌కు ఎమ్మెల్యే గ్రంథి శ్రీ‌నివాస్ స‌వాల్‌

 భీమవరం: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడమే చంద్రబాబు లక్ష్యమని వైయ‌స్ఆర్‌సీపీఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐటీ నోటీసుల అంశాన్ని దృష్టి మరల్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని, పుంగనూరులో చేసిన అరాచకాన్నే భీమవరంలో చేశారని దుయ్యబట్టారు.  

సీఎం వైయ‌స్ జగన్‌కు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నార‌ని గ్రంథి శ్రీ‌నివాస్ మండిప‌డ్డారు. లోకేష్‌ ప్రతీ చోటా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలతో పాటు పోలీసులపైనా దాడి చేశారు. సాధారణ ప్రజలపైనా దాడులకు పాల్పడ్డారు. శాంతి భద్రతల సమస్య సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు సంయమనంతో ఉన్నారు. పోలీసులు కూడా సహనంతో వ్యవహరించారు. వైయ‌స్ఆర్‌సీపీ ఫ్లెక్సీలు చించేశార‌ని  ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

 మేం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం. ఎవరి యాత్రయినా సజావుగా జరగాలని కోరుకుంటామ‌ని శ్రీ‌నివాస్ అన్నారు. లోకేశ్‌, టీడీపీ నేతలు మాత్రం రెచ్చగొడుతున్నారు. మాటలతో రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం వైయ‌స్ జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన కుమ్మక్కైనా నేను గెలిచా. టీడీపీ ఏ సభకూ ప్రజల నుంచి స్పందన లేదు. నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. దొంగనోట్లు మార్చేవారిని పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారు’’  అంటూ నిప్పులు చెరిగారు. 

ఎవరో రాసిచ్చిన మాటలను లోకేష్‌ చదువుతున్నాడ‌ని గ్రంథి శ్రీ‌నివాస్ త‌ప్పుప‌ట్టారు.  నాపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించే దమ్ముందా?. అంటూ లోకేష్‌కు స‌వాల్ విసిరారు. రూ.52 కోట్లు తీసుకున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖండించారు.

వంద ఎకరాలు తీసుకున్నానంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలు రుజువు చేసే దుమ్ము లోకేశ్‌కు ఉందా?. నేను ఇల్లు కట్టుకోవడం తప్పా?. నీకు, నీ తండ్రికి తప్ప ఇంకెవరికీ ఇల్లు ఉండకూడదా?. ఎవరో చెప్పింది విని లోకేశ్‌ మాట్లాడటం సరికాదు. భీమవరంలో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ఏ రోజైనా చంద్రబాబు ప్రజా సంక్షేమం పట్టించుకున్నాడా? అంటూ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ మండిపడ్డారు.

తాజా వీడియోలు

Back to Top