సీఎంకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల అమర్యాదగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సభలో చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు అసెంబ్లీ ఆవరణలో ఎవరూ అడ్డుపడలేదని, ఎక్కడా అగౌరవ పరిచే మాటలు మాట్లాడలేదన్నారు. కావాలనే చంద్రబాబు ముఖ్యమంత్రిని ఉన్మాది అంటూ అమర్యాదగా మాట్లాడారన్నారు. అమర్యాదగా మాట్లాడిన చంద్రబాబు వెంటనే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని, చెప్పలేకపోతే ఆయన విజ్ఞతకే వదిలేసి ప్రజా సమస్యలపై చర్చ జరపాలని కోరారు. ముఖ్యమంత్రిపై చంద్రబాబే కామెంట్లు చేసి సభలోకి వచ్చి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంసజం అని ప్రశ్నించారు. 

   

తాజా ఫోటోలు

Back to Top