తాడేపల్లి: 2024లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ల పాత్ర చాలా కీలకమైందని వైయస్ఆర్ సీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. శనివారం తాడేపల్లిలోని ఫార్ట్యూన్ గ్రాండ్ హోటల్‌లో వైయస్ఆర్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిమూలపు సతీష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో డాక్టర్ల పాత్రపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేశారని, నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల రూపురేఖలు మార్చారన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని చెవిరెడ్డి కోరారు. డాక్టర్లు అందరు కలిసి 2024 లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటం కోసం విశేషంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ .బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, డాక్టర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.