

















ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
వినుకొండ: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రుణం తీర్చుకోలేమని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయం పంపిణీ కార్యక్రమంలో భాగంగా వినుకొండలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అధ్యక్ష ఉపన్యాసం ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ రోజు వినుకొండకు మన సీఎం వైయస్ జగన్ ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలో దాహార్తి తీర్చిన వైయస్ జగన్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 17,250 ఎకరాల్లో పూర్తిగా రీసర్వే చేయించి రైతులకు అండగా నిలిచారు. వినుకొండ పట్టణానికి పూర్తిస్థాయిలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. గొల్లపల్లి చెరువు నిండితే వినుకొండ పట్టణానికి సంబంధించిన మంచినీటి సమస్య ఎలా పరిష్కారం అయ్యిందో? చెరువుకు డిప్ కట్‌కు నీళ్లు అందిస్తే ఇక సమస్యే ఉండదు. వైయస్ జగన్ రుణం తీర్చుకోలేం. వైయస్ జగన్ వచ్చిన తరువాత మన నియోజకవర్గమే ముందుంది. వైయస్ జగన్ ఆదరణను మనం ఎప్పటికీ మరచిపోలేం. చిన్న రైతు నుంచి ఎమ్మెల్యేగా ఎదిగేలా వైయస్ జగన్ రాజకీయ భిక్ష పెట్టారు. నాలాగా పేదవారికి ఇలాంటి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.