ఫ్లూటు జింక ముందు ఊదు..సింహం ముందు కాదు

ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌

అమరావతి:  అసెంబ్లీలో టీడీపీ సభ్యులు విజిల్స్‌ ఊదడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమా డైలాగ్‌ను ఉదహరిస్తూ..ఫ్లూటు జింక ముందు ఊదు..మీ బావ  చంద్రబాబు ముందు ఫ్లూట్‌ ఊదుకోవాలి..సింహం లాంటి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముందు ఊదకండి అంటూ మధుసూదన్‌ బాలకృష్ణకు హితవు పలికారు. చంద్రబాబు సైకో..ఆయన తమ్ముడికి మెంటల్‌ ఉందని, బాలకృష్ణకు మెంటల్‌ సర్టిఫికెట్‌ ఉందని చెప్పారు. అలాంటి బాలకృష్ణ సభలో కాల్పులు జరిపే అవకాశం ఉందని, అతన్ని బయటకు పంపించాలని, టీడీపీ సభ్యులను మానసిక ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్యే స్పీకర్‌ను కోరారు. అసెంబ్లీలో ఇలాంటి ప్రవర్తన సరికాదని మధుసూదన్‌ పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top