తాడిపత్రిలో జేసీ ఆటలు ఇంక సాగవు 

ఎమ్మెల్యే ఆర్థర్‌
 

కర్నూలు: తాడిపత్రిలో జేసీ ఆటలు ఇంక సాగవని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ హెచ్చరించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట ఇంకోసారి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. పోలీసులు లేకుండా బయటకు వెళ్లనేని నువ్వు, బూట్లు నాకిస్తానంటావా? అక్కడే ఉన్న చంద్రబాబు నవ్వుతూ పోలీసులను కించపరుస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో జేసీ ఆటలు ఇంక సాగవు అంటూ హెచ్చరించారు. ‘పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాజీ పోలీస్‌ అధికారిగా పోలీసులకు నేను సపోర్ట్‌ చేస్తున్న. అనంతపురంలో జేసీ, చంద్రబాబులపై వెంటనే కేసు నమోదు చేయాలి. జేసీ, నేను మాజీ పోలీస్‌గా సవాల్‌ చేస్తున్నా. రా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. పోలీసుల బూట్లు అంటే యుద్ధంలో ఆయుధాలు. వాటిని ముద్దాడుతాం. అహర్నిశలు చెమటోడ్చి సమాజం కోసం పనిచేస్తున్నది పోలీసులు మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top