మేం ఒకే అంటే టీడీపీ ఎమ్మెల్సీలు వైయస్‌ఆర్‌సీపీలోకి క్యూ

మండలి చైర్మన్‌ నిర్ణయం అప్రజాస్వామికం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

మీడియా పాయింట్‌: మేం ఒకే అంటే టీడీపీ ఎమ్మెల్సీలు వైయస్‌ఆర్‌సీపీలోకి క్యూ కడతారని, కానీ అది మా విధానం కాదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మండలిలో నిన్న చైర్మన్‌ వ్యవహరించిన తీరు సరికాదని ఆయన ఖండించారు. మీడియా పాయింట్‌లో అంబటి మాట్లాడారు. 
మండలి చైర్మన్‌ నిర్ణయాన్ని మేధావులంతా తప్పుబడుతున్నారు. టీడీపీ రాజ్యాంగ స్ఫూర్తిని మరిచిపోయింది. ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలి. సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగ విలువలను టీడీపీ అపహాస్యం చేసింది. చైర్మన్‌ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. మండలిని అభివృద్ధి నిరోధకంగా మార్చాలని టీడీపీ యత్నిస్తోంది. ఇది దురదృష్టకర పరిణామం. చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు. రాజధానిపై తీసుకున్న నిర్ణయం ఆలోచించి తీసుకున్నది. చైర్మన్‌ రూల్‌ ప్రకారం వ్యవహరించాలని కోరాం. టీడీపీ నేతలు రూల్‌కు భిన్నంగా చేయమని కోరారు. బిల్లును అడ్డుకోవడం ద్వారా వైజాగ్‌ రాజధాని వెళ్లకుండా ఆపగలరా? బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం ద్వారా ఎంతకాలం బిల్లును అడ్డుకోగలరు. చైర్మన్‌ స్వయంగా చెప్పారు..తానే తప్పు చేశానని సభలోనే ఒప్పుకున్నారు. మేం ఒకే అంటే టీడీపీ ఎమ్మెల్సీలు వైయస్‌ఆర్‌సీపీలోకి క్యూ కడతారు. కాని అది మా విధానం కాదు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. ప్రజలను మభ్యపెట్టే విధానాన్ని చంద్రబాబు, పవన్‌ మానుకోవాలి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసిన వారిపై విచారణ జరుగుతుంది. ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. టీడీపీ నేతలు చేసిన తప్పులు త్వరలోనే అన్ని బయటపెడతాం.
 

తాజా వీడియోలు

Back to Top