పేదల సొంతింటి కల సాకారమైంది

రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదని చంద్రబాబు కుట్ర

పేదల దశాబ్ధాల కల నెరవేరిన రోజు ఇది

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

వెంకటాయపాలెం: పేదల సొంతింటి కల ఇవాళ  సాకారమైందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదని చంద్రబాబు కుట్రలు చేస్తే వాటిని ఛేదించి పేదల దశాబ్ధాల కలను నెరవేర్చిన రోజు ఇదన్నారు. వెంకటాయపాలెంలో ఏర్పాటు చేసిన ఇళ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
అన్నా..పేదల దశాబ్ధాల కల ఇది. ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలనే మీ సంకల్పం చాలా గొప్పది. అన్నా..మీ దయ వల్ల ఇప్పటికే రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మంగళగిరి–తాడికొండలో పేదలు ఉండకూడదని చంద్రబాబు రైతుల ముసుగులో దళారులను ప్రోత్సహించి కోర్టుల్లో కేసులు వేసినా కూడా మీకు భగవంతుడు తోడుగా ఉండటంతో మీరు పేదలకు అండగా ఉండటం అనేది ఈ ప్రాంత ప్రజలకు అదృష్టం. సుమారు నెల రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ రోజు ఒక మాట ఇచ్చారు. రాజకీయాల్లో ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలని, దాని కోసం ఎందాకైనా వెళ్లాలనే మీ సంకల్పానికి నిదర్శంగా ఈ రోజు ఇళ్ల నిర్మాణాల మంజూరు పత్రాలు అందించడం అనేది నిజంగా ఈ ప్రాంత ప్రజలందరి అదృష్టంగా భావిస్తున్నాం.
ఒకానొక సమయంలో ఈ ప్రాంతంలో ఇళ్లు అద్దెకు కావాలంటే కూడా నీ కులం, మతం ఏంటని అడిగిన రోజులు ఉండేవి. ఈ రోజు ఆ పేదలందరూ జగనన్న ఇచ్చిన ఇల్లు మానవత్వంతో కూడుకుని ఉందని సగర్వంగా చెప్పుకుంటున్నారు. అతి త్వరలోనే పేదలు ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని సంతోషంగా గృహ ప్రవేశాలు చేసుకునేలా మీరందరూ కూడా వారికి అండగా నిలబడాలని మనసారా కోరుకుంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముగించారు.
 

తాజా వీడియోలు

Back to Top