సీఎం వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

రాజమండ్రి: ఆడపడుచులకు రక్షణ కవచంలా దిశ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి యావత్తు మహిళాలోకం ధన్యవాదాలు తెలుపుతోందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి అని, మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు నడిపిస్తున్నారన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించిన దిశ సెమినార్‌లో పాల్గొన్న మంత్రి వనిత మాట్లాడుతూ.. ‘దిశ పోలీస్‌ స్టేషన్, వన్‌స్టాప్‌ సెంటర్‌ను రాజమండ్రిలో ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు. మహిళా రక్షణ కోసం చక్కటి దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. మహిళలను గౌరవించడం మన దేశ సంప్రదాయం, పరాయి స్త్రీని కూడా మాతృమూర్తితో సమానంగా గౌరవిస్తుంటాం. అలాంటి మన దేశంలోనే  బాలికలు, పసికందులు, మహిళలపై  రోజూ ఎన్నో అత్యాచారాలు, లైగింక వేధింపులు, దాడులు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా.. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మహిళల పక్షపాతిగా, మన ఇంటి పెద్దలా ఆలోచించి దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. యావత్తు మహిళా లోకం ఈ చట్టాన్ని మనకు అందించిన సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మహిళలు, పసికందులు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే నిందితులను 21 రోజుల్లో శిక్షించాలనేది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఏడు రోజుల్లో విచారణ జరిపించి 14 రోజుల్లో న్యాయపరమైన దర్యాప్తు జరిపించి తప్పు తేలితే 21 రోజుల్లో శిక్ష విధించడం దిశ చట్టం ముఖ్య ఉద్దేశం. న్యాయవిచారణ జరిగేందుకు ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేస్తున్నాం. వన్‌స్టాప్‌ సెంటర్‌లోనే వైద్యం, న్యాయ పరమైన సేవలు అందించనున్నాం. బాధితులందరికీ సాయం అందించడం జరుగుతుంది. సోషల్‌ మీడియాలో మహిళలపై భయంకరమైన పోస్టులు పెడుతున్నారు.. మొదటి తప్పుగా అయితే వాళ్లకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, రెండోసారి చేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి’ అని మంత్రి వనిత కోరారు. 
 

Back to Top